Mitchell Starc became 2nd bowler in Ashes to take wicket for very first delivery : ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (ENG vs AUS) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes  సిరీస్ 2021-22 ప్రారంభమైంది. బ్రిస్బేన్‌ (Brisbane Test) వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc) అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో తొలి బంతికే వికెట్ తీసి రికార్డుల్లో నిలిచాడు. యాషెస్‌ చరిత్రలో ఒక ఆస్ట్రేలియన్‌ పేసర్‌ తొలి టెస్టు తొలి బంతికే వికెట్‌ తీయడం 85 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇంతకముందు 1936లో ఆస్ట్రేలియా పేసర్‌ ఎర్నీ మెక్‌కార్మిక్.. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ స్టాన్‌ వర్తింగ్‌టన్‌ను తొలి బంతికే డకౌట్‌గా అవుట్ చేశాడు. అయితే మెక్‌కార్మిక్, స్టార్క్‌ ఇద్దరూ బ్రిస్బేన్‌ మైదానంలోనే ఈ రికార్డు నమోదు చేయడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రిస్బేన్‌ టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ (Mitchell Starc) భారీ షాక్ ఇచ్చాడు. స్టార్క్ వేసిన తొలి బంతికే ఇంగ్లీష్ స్టార్ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (Rory Burns) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతిని హిట్‌ చేయడంలో బర్న్స్‌ విఫలమయ్యాడు. దీంతో​ బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో టెస్టుల్లో తొలి బంతికే వికెట్ (Wicket For Very First Delivery) తీసిన రెండో బౌలర్‌గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. మరోవైపు టెస్టుల్లో తొలి ఓవర్లోనే వికెట్ తీయడం స్టార్క్‌కు ఇది 13వ సారి కావడం విశేషం. 


Also Read: RRR Trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌కు కుదిరిన ముహూర్తం.. ఎన్టీఆర్ వీడియో విడుద‌ల‌!!


తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు కేవ‌లం 147 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, ఫాస్ట్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ (Pat Cummins) అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకొని దెబ్బ కొట్టాడు. ఆసీస్‌ బౌలర్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా కమిన్స్‌ సూపర్‌ స్పెల్‌తో వావ్ అనిపించాడు. 13 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జాస్‌ బట్లర్‌ 39 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓలీ పోప్‌ 35 పరుగులు చేశాడు. క్రిస్‌ వోక్స్‌ 21, హసీబ్‌ హమీద్‌ 25  రాణించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. కమిన్స్ 5 వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్‌ 2, జోష్‌ హాజిల్‌వుడ్‌ 2, కామెరాన్‌ గ్రీన్‌ 1 వికెట్‌ తీశారు.  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook