IND Vs ENG 5th Test: దంచికొట్టిన బెయిర్‌స్టో, రూట్.. ఇంగ్లండ్ ఘన విజయం! భారత్ ఆశలు ఆవిరి
England beat India in Edgbaston Test. బర్మింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్ట్ మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
Jonny Bairstow century helps England beat India: బర్మింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్ట్ (ఐదో టెస్టు) మ్యాచులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. స్టార్ బ్యాటర్ జో రూట్ (142 నాటౌట్; 173 బంతుల్లో 19x4, 1x6), హిట్టర్ జానీ బెయిర్‌స్టో (114 నాటౌట్; 145 బంతుల్లో 15x4, 1x6) సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. దాంతో ఇంగ్లీష్ గడ్డపై సిరీస్ గెలవాలని చూసిన భారత్ ఆశలు ఆవిరయ్యాయి.
మంగళవారం 259/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఎక్కడా తడబడలేదు. 72 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో జానీ బెయిర్‌స్టో, 76 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన జో రూట్.. భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ ఇద్దరు ఎడాపెడా బౌండరీలతో చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు సెంచరీలు చేశారు. చివరకు 76.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ 378 పరుగుల టార్గెట్ ఛేదించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. 2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలవాలన్న భారత కల కలగానే మిగిలిపోయింది.
కీలక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా వికెట్లు కోల్పోయి 245 పరుగులకే ఆలౌటై మూల్యం చెల్లించుకుంది. 378 మంచి టార్గెట్ అయినా టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిన మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ నిరాశ పరిచారు. ఒక్క వికెట్ తీయకపోగా.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక హనుమ విహారి విడిచిన క్యాచ్ కూడా ఇంగ్లండ్ జట్టుకు కలిసొచ్చింది. మొత్తానికి ఈ మ్యాచ్ భారత బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగానే ఓడిందని చెప్పొచ్చు.
సంక్షిప్త స్కోర్:
భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (రిషబ్ పంత్ 146, రవీంద్ర జడేజా 104; జేమ్స్ అండర్సన్ 5/60)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ (జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36; మహమ్మద్ సిరాజ్ 4/66)
భారత్ రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ (చేతేశ్వర్ పుజారా 66, రిషబ్ పంత్ 57; బెన్ స్టోక్స్ 4/33)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 76.4 ఓవర్లలో 378/3 జానీ బెయిర్‌స్టో 114 నాటౌట్, జో రూట్ 142 నాటౌట్; జస్ప్రీత్ బుమ్రా 2/74)
Also Read: TRS Leaders Changing Party: కారు దిగుతున్న గులాబీ నేతలు.. డేంజర్ జోన్‌లో టీఆర్ఎస్ ?
Also Read: Samantha Ruthprabhu: సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ఆ నేత ఫోటో షేర్ చేయడంతో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook