Rishabh Pant Century: పంత్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం! సిరీస్ కైవసం
India beat England in 3rd ODI and take ODI series 2-1. ఇంగ్లండ్‌తో హోరాహోరీగా సాగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Rishabh Pant Century helps India beat England in 3rd ODI: మాంచెస్టర్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌తో హోరాహోరీగా సాగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (125 నాటౌట్; 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ బాధగా.. హార్దిక్ పాండ్యా (71; 55 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భారత్ 2-1తో వన్డే సిరీస్ గెలిచింది. పంత్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', పాండ్యాకు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఆదిలోనే మొహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. రెండో ఓవర్‌లో స్టార్ బ్యాటర్లు జానీ బెయిర్‌స్టో (0), జో రూట్ (0)లను డకౌట్ చేశాడు. దీంతో జాసన్ రాయ్ (41; 31 బంతుల్లో 7 ఫోర్లు), బెన్ స్టోక్స్ (27; 29 బంతుల్లో 4 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అడపాదడపా బౌండరీలతో స్కోరు పెంచారు. అయితే హార్దిక్ పాండ్యా వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్ పంపాడు.
ఈ సమయంలో స్టార్ బ్యాటర్ మొయిన్ అలీ (34; 44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో కెప్టెన్ జోస్ బట్లర్ (60; 80 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలోనే బట్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలీ పెవిలిన్ చేరిన అనంతరం లియాన్ లివింగ్‌స్టోన్ (31 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. లివింగ్‌స్టోన్, బట్లర్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. డేవిడ్ విల్లే (18) అండతో క్రెయిగ్ ఓవర్టన్ (33; 33 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చెలరేగడంతో ఇంగ్లండ్ పోరాడే స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (17), విరాట్ కోహ్లీ (17)లను రీస్ టాప్లీ ఔట్ చేశాడు. దాంతో భారత్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇది చాలదన్నట్టు సూర్యకుమార్ యాదవ్ (16) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఈ సమయంలో రిషబ్ పంత్‌కు జతయిన హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా ఆడుతో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలోనే పాండ్యా, పంత్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో భారత్ స్కోరు 200 దాటింది. పాండ్యా అవుటైనా.. రవీంద్ర జడేజా (7 నాటౌట్) అండతో పంత్ విజయాన్ని భారత్ ఖాతాలో వేశాడు.
Also Read: Horoscope Today July 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించిన ధన లాభం!
Also Read: TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook