ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022 సెమీస్ మూడవ బెర్త్ కూడా ఖరారైంది. బంగ్లాదేశ్ టీమ్‌ను మట్టి కరిపించి ఇంగ్లండ్ మహిళల టీమ్ సెమీస్‌కు చేరింది. ఇక మిగిలింది ఇండియానే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ 2022 చివరి దశకు వచ్చింది. ఇక మిగిలింది సెమీఫైనల్స్, ఫైనల్స్ మాత్రమే. ఇప్పటికే మూడు జట్లు సెమీస్‌కు చేరాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు చేరగా..మూడవ టీమ్‌గా ఇంగ్లండ్ ఎంట్రీ ఇచ్చింది. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి సెమీపైనల్స్ మూడవ బెర్త్ ఖరారు చేసుకుంది. 


టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నేపధ్యంలో డానియెల్ వ్యాట్, కెప్టెన్ హీథర్ నైట్ వికెట్ ముందే కోల్పోయినా..ఆ తరువాత ఇన్నింగ్స్ స్థిరపడింది. నిర్ణీత 50 ఓవర్లలో 234 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లే 67 పరుగులతో, నటాలీ సీవర్ 40 పరుగులతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సెట్ చేశారు. 


ఆ తరువాత లక్ష్యం ఛేదించేందుకు రంగంలో దిగిన బంగ్లాదేశ్ విమెన్స్ టీమ్..ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చినా..మిడిలార్డర్ బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. 48 ఓవర్లలో 134 పరుగులకే ఆలవుట్ అయింది. ఏకంగా వంద పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించి..సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక నాలుగవ బెర్త్ కోసం భారత్..దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ గెలవక తప్పని పరిస్థితి. ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి..274 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. 


Also read: Womens World Cup 2022: చెలరేగిన భారత మహిళలు.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్! గెలిస్తేనే మిథాలీసేన సెమీస్‌కు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook