Lucknow Super Giants Fast Bowler Mark Wood ruled out of IPL 2022 with Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆరంభానికి ముందే కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్‌ స్టార్ పేసర్‌ మార్క్‌ వుడ్‌ ఐపీఎల్‌ 15వ సీజన్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. వుడ్‌ను లక్నో ప్రాంచైజీ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 7.5 కోట్లకు కొనుగోలుచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్టిండీస్‌తో గత వారం జరిగిన తొలి టెస్టులో ఆడుతూ మార్క్‌ వుడ్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో 17 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన వుడ్.. కుడి మోచేతి గాయం కారణంగా మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోయాడు. వుడ్ గాయం తీవ్రతపై గతవారం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వని ఈసీబీ.. తాజాగా అతడు కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని పేర్కొంది. దాంతో ఐపీఎల్ 2022 సీజన్‌కి వుడ్ దూరమవడం ఖాయం అయింది. ఇదే విషయంను లక్నో ఫ్రాంఛేజీకి ఈసీబీ సమాచారం కూడా ఇచ్చిందని సమాచారం తెలుస్తోంది. 


2018లో ఐపీఎల్‌ టోర్నీలోకి అరంగేట్రం చేసిన మార్క్‌ వుడ్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. 2018లో చెన్నై తరఫున ఒక మ్యాచ్ ఆడిన వుడ్.. ముంబైపై 4 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చాడు. దాంతో అతడు ఇంకో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. గత రెండేళ్లలో ఇంగ్లీష్ జట్టులో టాప్ బౌలర్‌గా ఎదిగిన వుడ్.. రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2022 వేలంలోకి వచ్చాడు. అతని కోసం ఢిల్లీ, ముంబై , లక్నో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు లక్నో రూ.7.50 కోట్లకి దక్కించుకుంది. కానీ ఐపీఎల్ ఆరంభానికి ముందు లక్నోకు నిరాశే మిగిలింది. 


ఐపీఎల్‌ 2022 సీజన్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. లక్నో జట్టుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు. మెగా లీగ్ మార్చి 26న ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో లీగ్ మొదటి మ్యాచ్ జరగనుంది. ఇక లక్నో టీమ్ తన మొదటి మ్యాచ్‌ని గుజరాత్ టైటాన్స్‌తో మార్చి 28న ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం లక్నో ప్రాక్టీస్ మొదలెట్టింది. 


Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రీమియర్‌కి ప్రభాస్‌ని పిలుద్దామా.. ఎన్టీఆర్‌కి రాజమౌళి ఏం చెప్పాడో తెలుసా?! నవ్వులే నవ్వులు!!


Also Read: MS Dhoni: 'జెర్సీ నంబర్‌ 7' వెనకున్న రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ.. విషయమేంటో తెలిస్తే షాకే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook