India vs England: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. భారత్‌తో సిరీస్‌కు ముందే ఆ స్టార్ బ్యాటర్ ఔట్..
India vs England: టీమిండియాతో టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈసీబీ తెలిపింది.
Harry Brook: భారత్‌తో టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్న ఈసీబీ పేర్కొంది. అతడు ఈ సిరీస్ కు అందుబాటులో ఉండడని.. త్వరలోనే బ్రూక్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేస్తామని ఈసీబీ తెలిపింది. అయితే బ్రూక్ కుటుంబంలో ఏం జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఈ విషయంలో గోపత్య పాటించాలని మీడియాను ఈసీబీ కోరినట్లు తెలుస్తోంది.
జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్ – ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగునుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ పోరు ఉండనుంది. కాగా ఇంగ్లండ్ గత రెండేళ్లలో సాధిస్తున్న బజ్‌బాల్ విజయాలలో బ్రూక్‌ది కీలక పాత్ర. ఈ మిడిలార్డర్ బ్యాటర్ టెస్టులలో 91.76 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా 12 టెస్టులు ఆడిన బ్రూక్.. ఏకంగా 62.15 సగటుతో 1,181 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలున్నాయి. భారత్‌తో సిరీస్‌లో మిడిలార్డర్‌లో కీలకంగా మారుతాడని భావించిన బ్రూక్ లేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
Also Read: U19 World Cup 2024: వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం.. తొలిపోరులో బంగ్లాను చితక్కొటిన యువ భారత్..
ఇంగ్లాండ్ స్క్వాడ్
బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్
Also Read: Good News: ఉప్పల్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. వారికి మాత్రం ఫ్రీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter