ICC U19 World Cup 2024: అండర్ – 19 వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత్.. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సౌమి పాండే నాలుగు వికెట్లుతో చెలరేగాడు.
తొలుత బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదర్శ్ సింగ్ మరియు ఉదయ్ సహారన్ ఆదుకున్నారు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఆదర్శ సింగ్ 76 పరుగులు, ఉదయ్ 64 పరుగులతో సత్తా చాటారు. చివరలో సచిన్ దాస్ 26 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో మరుఫ్ మ్రిదా ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
Also Read: Good News: ఉప్పల్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. వారికి మాత్రం ఫ్రీ..!
అనంతరం లక్ష్యఛేదనను ప్రారంభించిన బంగ్లా జట్టు ఆది నుంచే వికెట్లను కోల్పోయింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును మహ్మద్ రెహ్మన్, అరిపుల్ ఇస్లాం జోడి ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 77 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ముషీర్ ఖాన్ విడదీయడంతో బంగ్లా పతనం మళ్లీ మొదలైంది. చివరి బ్యాటర్ల ఎవరూ రాణించకపోవడంతో బంగ్లా జట్టు 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తన తర్వాత మ్యాచ్‌ను ఈనెల 25న ఐర్లాండ్‌తో ఆడనుంది.
Also read: Shoaib Malik Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter