England vs India 2nd ODI playing 11 out: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌.. రెండో వన్డేకు సిద్ధమైంది. లార్డ్స్‌ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. చివరి టీ20లో గాయపడిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తుది జట్టులోకి వచ్చేశాడు. దాంతో శ్రేయాస్ అయ్యర్‌కు నిరాశే ఎదురైంది. మరోవైపు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్‌.. లక్ష్య ఛేదనలో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా విజయం సాధించింది. అదే జోరు కొనసాగించి సిరీస్‌ పట్టేయాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో పుంజుకొని సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ కసితో ఉంది. మరి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. రెండు జట్లు బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.


వన్డే క్రికెట్లో ఇంగ్లండ్‌పై భారత్‌దే కాస్త పైచేయిగా ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు 104 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ 56 విజయాలు, ఇంగ్లండ్ 43 మ్యాచులు గెలిచింది. రెండు టైగా ముగియగా.. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. మరోవైపు ఇప్పటివరకూ లార్డ్స్‌లో భారత్‌ 8 వన్డేలు ఆడి.. నాలుగు గెలిచి, మూడింటిలో ఓడింది. ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది. 




తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్, ప్రసిద్ధ్ కృష్ణ. 
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్‌ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, క్రెగ్ ఓవర్టన్, డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, రీస్ టాప్లే.


Also Read: Nokia 2660 Flip: నోకియా నుంచి డ్యూయల్ స్క్రీన్‌ మొబైల్... ధర ఎంతో తెలుసా..  


Also Read: Maharashtra: కొత్త ముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే కీలక నిర్ణయం, పెట్రోల్-డీజిల్‌పై వ్యాట్


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook