Nokia 2660 Flip: నోకియా నుంచి డ్యూయల్ స్క్రీన్‌ మొబైల్... ధర ఎంతో తెలుసా..

NOKIA 2660 Flip: నోకియా నుంచి మరో ఫీచర్ మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అయింది. దాని ఫీచర్స్, ధర ఇతరత్రా వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 14, 2022, 06:13 PM IST
  • నోకియా నుంచి నోకియా 2660 ఫ్లిప్ లాంచ్
  • ఆకర్షణీయమైన డిజైన్‌తో డ్యూయల్ డిస్‌ప్లే మొబైల్
  • మొబైల్ ఫీచర్స్, ధర వివరాలివే..
Nokia 2660 Flip: నోకియా నుంచి డ్యూయల్ స్క్రీన్‌ మొబైల్... ధర ఎంతో తెలుసా..

NOKIA 2660 Flip: ఒకప్పుడు సెల్‌ఫోన్ అనగానే నోకియా గుర్తొచ్చేది. స్మార్ట్ ఫోన్ల రాకతో నోకియా పోటీలో వెనుకబడింది. కేవలం ఫీచర్ ఫోన్లకే పరిమితమైంది. అడపా దడపా నోకియా నుంచి స్మార్ట్ ఫోన్లు వచ్చినా.. అవి ఆశించిన స్థాయిలో క్లిక్ అవలేదు. ఫీచర్ ఫోన్ల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన నోకియా.. తాజాగా మరో కొత్త ఫీచర్ మోడల్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆ ఫోన్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

నోకియా 2660 ఫ్లిప్ లాంచ్ :

నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ ఫోన్‌ని మంగళవారం (జూలై 12) లాంచ్ చేసింది. దీనికి డ్యూయల్ స్క్రీన్ ఉండటం విశేషం. 2.8 అంగుళాల డిస్‌ప్లేతో రెండు స్క్రీన్స్ ఇవ్వబడ్డాయి. ఒక స్క్రీన్ ముందు వైపు, రెండో స్క్రీన్ వెనుక వైపు ఇవ్వబడింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

నోకియా 2660 ఫ్లిప్ స్టోరేజీ :

నోకియా 2660 ఫ్లిప్ యునిసాక్ టీ107 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీనిలో 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఉంటుంది. అలాగే 32 జీబీ ఎక్స్‌పాండెడ్ స్టోరేజీ కలిగి ఉంటుంది.

నోకియా 2660 బ్యాటరీ :

నోకియా 2660 ఫ్లిప్‌ బ్యాటరీ 1450 mAh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్, వీజీఏ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎఫ్ఎం రేడియోకి హెడ్ సెట్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.

నోకియా 2660 ఫ్లిప్ ధర :

నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ మొబైల్ ధర రూ.4689. ఈ ఫోన్‌తో పాటు నోకియా 8210 4జీ, నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫోన్లు కూడా మంగళవారమే (జూలై 12) మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి.

Also Read: MK Stalin Hospitalised: చెన్నై కావేరీ ఆసుపత్రిలో చేరిన సీఎం ఎంకె స్టాలిన్...  

Also Read: Neetu Chandra: పెళ్ళాంగా ఉంటే నెలకు 25 లక్షలు.. దారుణమైన విషయం బయటపెట్టిన నీతూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News