Anti- Sex beds Fact Check: శృంగారంలో పాల్గొనకుండా యాంటీ సెక్స్ బెడ్స్ ? స్పందించిన ఒలింపిక్స్ నిర్వాహకులు
Anti-Sex beds at Tokyo Olympics village, fact check: టోక్యో: టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న ఒలింపిక్స్ విలేజ్‌లో శృంగార కార్యకలాపాలను నిరోధించడానికి (To avoid sex) ఆటగాళ్ల గదుల్లో కార్డుబోర్డుతో తయారుచేసిన తక్కువ సామర్థ్యం కలిగిన బెడ్స్‌ను ఏర్పాటు చేశారు అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Anti-Sex beds at Tokyo Olympics village, fact check: టోక్యో: టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న ఒలింపిక్స్ విలేజ్‌లో శృంగార కార్యకలాపాలను నిరోధించడానికి (To avoid sex) ఆటగాళ్ల గదుల్లో కార్డుబోర్డుతో తయారుచేసిన తక్కువ సామర్థ్యం కలిగిన బెడ్స్‌ను ఏర్పాటు చేశారు అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనావైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో అథ్లెట్స్‌లో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందకుండా ఒలంపిక్స్ నిర్వాహకులు చేసిన ఏర్పాట్లలో భాగంగా ఆటగాళ్లు, అథ్లెట్లు శృంగారంలో పాల్గొనేందుకు వీలు లేకుండా అట్ట మంచాలను ( Anti-Sex beds) ఏర్పాటు చేశారనేది ఆ ప్రచారం సారాంశం.
అయితే, ఇదే విషయంపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందిస్తూ అదంతా ఉత్తుత్తి ప్రచారమే అని కొట్టిపారేశారు. ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన మంచాలు అట్టలతో తయారు చేసినప్పటికీ.. సామర్థ్యం పరంగా అవి దృఢంగానే ఉంటాయని ఒలంపిక్స్ నిర్వాహకులు స్పష్టం చేశారు. 200 కిలోల బరువును తట్టుకునే సామర్యం వీటికి ఉంటుందని నిర్వాహకులు చెప్పగా.. వారి వాదనను బలపరుస్తూ ఐర్లాండ్‌కు చెందిన రిస్ మెక్లెనగన్ అనే జిమ్నాస్ట్ (Irish gymnast, Rhys Mcclenaghan) ఆ బెడ్స్‌పై ఎగురుతుండగా రూపొందించిన ఓ వీడియోను నిర్వాహకులు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
Also read : Tokyo Olympics 2021: స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ Roger Federer కీలక నిర్ణయం, అభిమానులు షాక్
ఇదిలావుంటే, ఒలంపిక్స్ ట్రెడిషన్ ప్రకారమే ఒలంపిక్స్‌లో (Olympics) పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్స్ అందరికి కలిపి మొత్తం 1,60,000 ఫ్రీ కండోమ్స్ (Condoms) పంపీణీ చేసిన ఒలంపిక్స్ నిర్వాహకులు.. కరోనా కారణంగా శృంగారానికి దూరంగా ఉండాల్సిందిగా వారికి సూచించడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook