Facts About PV Sindhu: ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Facts About PV Sindhu: బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. అంతే కాకుండా ఒలింపిక్ గేమ్స్ లోని బ్యాడ్మింటన్ విభాగంలో వరుసగా రెండు పతకాలను సాధించిన రెండో భారత అథ్లెట్ గా పీవీ సింధు ఘనత సాధించింది. అయితే ఆమె గురించి తెలియని మరికొన్ని విశేషాలూ ఉన్నాయి.
Facts About PV Sindhu: పూసర్ల వెంకట సింధు అంటే తెలియని భారతీయులు ఉండరు. ఎందుకంటే ఆమె అంతర్జాతీయంగా భారత జెండాను రెపరెపలాడించింది. బ్యాడ్మింటన్ లో దేశానికి ఎన్నో మెడల్స్ సాధించి.. విశేష గుర్తింపును తెచ్చుకుంది. ఆగస్టు 10, 2012న చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. అయితే పీవీ సింధు గురించి మీకు తెలియని ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా?
వ్యక్తిగతం
పీవీ సింధు 1995 జూలై 2న జన్మించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన ఆమె హైదరాబాద్‌లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. అతని తండ్రి ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ అయినప్పటికీ, సింధు బ్యాడ్మింటన్‌పై మొగ్గు చూపింది. ఆ తర్వాత ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్‌లో చేరింది.
తొలి భారతీయురాలిగా ఘనత
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి, ఏకైక భారతీయురాలిగానే కాకుండా.. ఒలింపిక్ క్రీడలలో వరుసగా రెండు పతకాలను రెండో అథ్లెట్ గా పీవీ సింధు ఘనట సాధించింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సింధు ఏడో ర్యాంక్‌లో కొనసాగుతుంది.
కుటుంబానికి దూరంగా..
లక్నోలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రీ గోల్డ్‌లో ఆడేందుకు 2012లో జరిగిన బ్యాడ్మింటన్‌లో సింధు తన సోదరి వివాహానికి దూరమైంది. అప్పటికి ఆమె వయస్సు 17 సంవత్సరాలు.
పట్టుదలతో..
బ్యాడ్మింటన్ కోసం పీవీ సింధు ఎంతో కఠోరమైన శ్రమ చేసింది. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లెల గోపీచంద్ అకాడమీకి వెళ్లేది. రోజూ ఆమె శిక్షణ కోసం తొలినాళ్లలో 120 కిలోమీటర్లు ప్రయాణించేదట.
ఇష్టమైన ఫుడ్ ను వదులుకొని..
పీవీ సింధుకు ఇష్టమైన ఆహారం పెరుగు, ఐస్ క్రీమ్. కానీ, ఆట కోసం ఈ రెండింటిని పీవీ సింధు దూరం చేసుకోలేక తప్పలేదు.
Also Read: Matthew Wade Wicket: మళ్లీ అంపైర్ తప్పిదం! కోపంతో బ్యాట్ ను బాదిన మాథ్యూ వేడ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook