Glenn Maxwell Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన గ్లెన్ మాక్స్‌వెల్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ చూస్తే..!

Glenn Maxwell takes stunning catch to dismiss Shubman Gill. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2022, 09:36 PM IST
  • ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన గ్లెన్ మాక్స్‌వెల్
  • విరాట్ కోహ్లీ రియాక్షన్ చూస్తే
  • సంబరాల్లో బెంగళూరు ప్లేయర్స్
Glenn Maxwell Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన గ్లెన్ మాక్స్‌వెల్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ చూస్తే..!

Glenn Maxwell takes one-handed stunning catch to dismiss Shubman Gill: క్రికెట్‌ ఆటలో ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని.. అందరిని ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్‌ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకుంటారు. ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం ఇప్పటికే చూసాం. తాజాగా ఐపీఎల్ 2022లో మరో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు.

ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం (మే 19) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడంతో బెంగళూరు బౌలింగ్‌కు దిగింది. మూడో ఓవర్‌ను ఆస్ట్రేలియా సీమర్ జోష్ హాజిల్‌వుడ్ బంతిని అందుకుని బెంగళూరుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (1)ను మూడో బంతికి పెవిలియన్ చేర్చాడు. 

జోష్ హాజిల్‌వుడ్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని ఆడటానికి ప్రయత్నించి శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. ఆఫ్ సైడ్ ఆడుదామనుకున్న గిల్.. లేట్ షాట్ ఆడడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు కాస్త దూరంగా వెళుతోంది. అయితే గాల్లోకి పక్షిలా ఎగిరిన మ్యాక్స్‌వెల్‌.. తన కుడివైపునకు దూకుతూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇంకేముంది గిల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ గట్టిగా అరుస్తూ మ్యాక్సీని హత్తుకున్నాడు. ఆపై బెంగళూరు ప్లేయర్స్ అందరూ సంబరాల్లో మునిగిపోయారు. 

గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు సంబంధించిన క్యాచ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫాన్స్.. 'స్టన్నింగ్‌ క్యాచ్'‌ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్', 'ఐపీఎల్ 2022లో సూపర్ క్యాచ్‌' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు ఈ క్యాచ్ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (62) హాఫ్ సెంచరీ చేశాడు. 

Also Read: Aishwarya Rai Bachchan Cannes 2022: కేన్స్‌లో ఐశ్వర్య రాయ్.. క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌ పైనే అందరి కళ్లు!

Also Read: IPL 2022 Final: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2022 ఫైనల్‌ మ్యాచ్‌ ఎప్పుడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News