Jasprit Bumrah's Tweet Goes Viral during IPL Auction 2022: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం రసవత్తరంగా సాగుతోంది. మెగా వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్లపై కనక వర్షం కురిసింది. తొలిరోజు జరిగిన వేలంలో స్వదేశీ, విదేశీ అనే తేడా లేకుండా అన్ని ప్రాంఛైజీలు భారీ మొత్తానికి కనుగోలు చేశారు. ఊహించని ధర రావడంతో కొందరు ఆనందంలో తేలిపోతున్నారు. ఈసారి రెండు కొత్త జట్లు టోర్నీలోకి వచ్చిన నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లకు క్యాష్ రిచ్ లీగులో ఆడే అవకాశం వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాట్ కమిన్స్, కాగిసో రబాడ, ట్రెంట్ బౌల్ట్, ఫఫ్ డుప్లెసిస్, క్వింటన్ డికాక్, జాసన్ హోల్డర్, వానిండు హాసరంగా, నికోలస్ పూరన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఎయిడెన్ మార్క్‌రమ్‌ లాంటి విదేశీ ఆటగాళ్లకు భారీ ధర పలికింది. భారత స్టార్ బ్యాటర్లు ఇషాన్‌ కిషన్, శ్రేయస్‌ అయ్యర్‌లకు భారీ ధర పలికింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అయ్యర్‌ను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేయగా.. రూ. 15.25 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్‌ను కైవసం చేసుకుంది. 


భారత పేసర్లు దీపక్‌ చహర్‌ (సీఎస్‌కే) రూ. 14 కోట్లు, శార్దూల్‌ ఠాకూర్ (డీసీ) రూ. 10.75 కోట్లు, అవేశ్‌ ఖాన్‌ (లక్నో) రూ. 10 కోట్లు, ప్రసిధ్‌ కృష్ణ (రాజస్థాన్) రూ. 10 కోట్లను సొంతం చేసుకున్నారు. మొత్తానికి మన బ్యాటర్ల కంటే ఎక్కువ మంది బౌలర్లు  జాక్ పాట్ కొట్టారు. వీళ్ల ధరలు చూశాక టీమిండియా ఫాన్స్.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై సెటైర్లు వేస్తున్నారు. బుమ్రా కూడా వేలంలో పాల్గొంటే బాగుండేదని అనుకుంటుండొచ్చని కామెంట్లు పెడుతున్నారు.


'దీపక్ చహర్ మరియు ప్రసిధ్‌ కృష్ణను ఓసారి చూస్తే.. జస్ప్రీత్ బుమ్రా కూడా ఐపీఎల్ 2022 వేలంకు వెళ్లాల్సింది. కనీసం 20 కోట్లు వచ్చేవి' అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి భారత పేసర్ స్పందించాడు. ట్వీట్‌లో బుమ్రా ఎలాంటి పదాలు వాడకున్నా.. కేవలం రెండు ఎమోజీలతోనే తన మనసులోని మాటలను బయటపెట్టాడు. బుమ్రా పోస్ట్ చేసిన నవ్వుతున్న ఎమోజీ, తలపట్టుకున్న ఎమోజీలను చుస్తే.. 'అయ్యోరామ ఎంతపానాయే.. వేలంలో పాల్గొంటే 20 కోట్లు వచ్చేవి' అనే అర్ధం వస్తుంది. ఆ ట్వీట్‌కు నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.



టీమిండియా స్టార్‌ పేసర్ ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడనే సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి అతడు ముంబైకే ఆడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. ముంబై వలనే బుమ్రా జాతీయ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ముంబై జట్టు అతడిని రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే బుమ్రా సరదాగా వేలంలో పాల్గొని ఉంటే బాగుండేదేమో అని భావించి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Eoin Morgan Unsold: పాపం మోర్గాన్.. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌.. ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు


Aslo Read: Liam Livingstone: లియామ్ లివింగ్‌స్టోన్‌పై కాసుల వర్షం.. సన్‌రైజర్స్‌తో పోటీపడి కొనుగోలు చేసిన పంజాబ్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook