Virat Kohli becomes first batter to score 4000 T20I runs: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగులు బాదిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా గురువారం అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ ఈ రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్‌పై విరాట్ 40 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఈ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే అత్యధిక పరుగుల వీరుడిగా విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీ బాది 4వేల మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 115 మ్యాచ్‌ల్లో 4008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 36 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ (3853) రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ (3497), పాకిస్తాన్ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (3323), ఐర్లాండ్‌ ఆటగాడు పాల్ స్టిర్లింగ్‌ (3181) టాప్-5లో ఉన్నారు. 


టీ20 ప్రపంచకప్‌ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ ఇటీవలే ఓ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేళ జయవర్దనే (1016)ను వెనక్కి నెట్టి 1141 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లోనూ అత్యధిక పరుగుల చేసిన రికార్డు కూడా కోహ్లీదే. ప్రస్తుత టోర్నీలో విరాట్ 6 మ్యాచ్‌ల్లో 98.66 స్ట్రైక్ రేట్‌తో 296 పరుగులు సాధించాడు. అత్యధిక వ్యక్తిగత రన్స్ 82 నాటౌట్. సూపర్ 12లో పాకిస్తాన్‌పై ఈ స్కోర్ చేశాడు. 



టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో 100 బౌండరీలు కొట్టిన ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. ఇక 2014, 2016 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలలో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేసి.. 'ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా నిలిచాడు. ఆసియాకప్ 2022 ద్వారా ఫామ్ అందుకున్న కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌ 2022లో కూడా కొనసాగించాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టాడు. 


Also Read: నాగ శౌర్య కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే.. అన్ని వందల కోట్లకు వారసురాలా?


Also Read: Urfi Javed F word: కేసులెందుకు అని అడిగితే బూతులతో విరుచుకుపడిన వింత జీవి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook