ప్లేఆఫ్‌లో కొన్ని మార్పులు: విలియమ్సన్
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్, చెన్నై మధ్య మంగళవారం మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ పదకొండ సీజన్‌లో ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన తొలి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. కీలకమైన ప్లేఆఫ్‌కు హైదరాబాద్‌తో పాటు చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు అర్హత సాధించాయి.
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రారంభంలో తొలుత హ్యాట్రిక్ విజయాలను అందుకున్న హైదరాబాద్.. ఆతరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయినా హ్యాట్రిక్ విజయాలు అందుకొని 18 పాయింట్లతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. చెన్నై రెండో స్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్, చెన్నై మధ్య మంగళవారం మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది.
అయితే ప్లేఆఫ్‌లో మార్పులు తప్పవని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నారు. పక్కా ప్రణాళికతో ప్లేఆఫ్‌లో బరిలోకి దిగుతామని అతడు తెలిపాడు. ఇందులో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు ముంబాయి వాంఖేడ్ స్టేడియంలో చెన్నైతో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా తమ జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిపాడు. తమ బలాలపై ఇక పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపాడు.
మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న కోల్‌కతా, రాజస్థాన్ మధ్య బుధవారం (మే 23, 2018, రాత్రి 7 గంటలకు) ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో శుక్రవారం (మే 25, 2018, రాత్రి 7 గంటలకు) క్వాలిఫైయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో క్వాలిఫైయర్-1లో నెగ్గిన జట్టుతో ఆదివారం(మే 27, 2018, రాత్రి 7 గంటలకు) ట్రోఫీ కోసం పోటీ పడుతుంది.