ఆల్ ది బెస్ట్.. ఆశీష్ నెహ్రా
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు ఢిల్లీలోని ఫిరోజ్ కోట్లా మైదానంలో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆశిష్ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నారు. ఆయన వీడ్కోలు సభ నిర్వహణకు ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజే నెహ్రా ఆడబోతున్న చివరి మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, రహానె, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ మొదలైన ఆటగాళ్లు ఆ వీడియోలో నెహ్రాతో తమ స్నేహబంధం గురించి మాట్లాడారు. రిటైర్‌మెంట్ ప్రకటించోతున్న నెహ్రాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఇప్పటి వరకు టీ20 మ్యాచ్‌ల్లో ఇండియా.. న్యూజిలాండ్‌పై ఒక్క ఆట కూడా నెగ్గలేదు. ఈ క్రమంలో.. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో లభించే విజయం.. నెహ్రాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని పలువురు టీమిండియా సభ్యులు అభిప్రాయపడ్డారు.