భారత క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్లలో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఉంటాడు. అయితే 2003 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజయాలలో, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాలలో యువీ (Yuvraj Singh) పాత్ర కీలకం. కానీ తనను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరైన రీతిలో సాగనంపలేదని, అవమానాలకు గురి చేశారంటూ యువరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. Viral: ఎందుకీ పనికిరాని టెక్నాలజీ.. నెటిజన్ల ఆగ్రహం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనను ఓ ప్రొఫెషనల్ క్రికెటర్‌గా చూడలేదని, రిటైర్మెంట్ కోసం గౌరవపూర్వక అవకాశం ఇవ్వలేదని ఆవేదనను వ్యక్తం చేశాడు. బీసీసీఐ అలా అవమానించినందుకు తానేమీ అంతగా ఆశ్చర్యపోలేదన్నాడు. భారత క్రికెట్‌లో మేటి క్రికెటర్లు అయిన వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ లాంటి సహచరులను సైతం అవమానించడంతో తన పరిస్థి దీనికంటే భిన్నం కాదని భావించాడట. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు 


దాదాపు 19 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలందించిన తనకు సెండాఫ్ (Yuvraj Singh About Send-Off) తగిన రీతిలో ఇచ్చి ఉంటే సంతోషించేవాడినని, కానీ కొన్నేళ్లుగా అలాంటివి జరగడం లేదని ‘స్పోర్ట్స్‌కీడా’తో ఈ విషయాలు షేర్ చేసుకున్నాడు. రెండు వరల్డ్ కప్‌లు సాధించడంలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌ను, గవాస్కర్ తర్వాత టెస్టుల్లో స్టార్‌గా విజయాలు అందించిన సెహ్వాగ్‌ను, బౌలింగ్‌లో మేటి అయిన జహీర్‌ను సైతం దారుణంగా పంపించేశారని మనసులో మాటల్ని బయటపెట్టాడు. ఈసారి కప్పు మనదే.. RCBని ఆటాడుకుంటున్న నెటిజన్లు


కాగా, 2019 వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందని ఆశపడ్డ స్టార్ ఆల్ రౌండర్ యువీకి బీసీసీఐ మొండిచేయి చూపింది. దీంతో వరల్డ్ కప్ జరుగుతుండగానే ఎంతో బాధతో క్రికెట్‌కు  యువరాజ్ వీడ్కోలు పలకడం తెలిసిందే.  బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్