Former Australia pacer Brett Lee clean bowls his Son Preston: ఆస్ట్రేలియా స్పీడస్టర్‌ బ్రెట్‌ లీ (Brett Lee) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ మేటి బ్యాటరలను సైతం తన పదునైన బంతులతో బెంబేలెత్తించాడు. కచ్చితమైన వేగం, లెంగ్త్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టాడు. 2005లో 161 కిలోమీటర్ల వేగంతో బంతిని సందించాడంటే.. బ్రెట్‌ లీ వేగం ఎలా ఉంటుందో మనం అర్థంచేసుకోవచ్చు. తన పేస్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించిన లీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికి తన బౌలింగ్‌లో పదును మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా బ్రెట్‌ లీ సరదాగా తన కుమారుడు ప్రెస్టోన్‌ (Preston)తో ఇంటి ఆవరణలో క్రికెట్‌ ఆడాడు. బండల మధ్యలో వికెట్లు పెట్టి.. టెన్నిస్ బంతితో గల్లీ క్రికెట్ ఆడారు. గతంలో ప్రత్యర్థులను తన బౌలింగ్‌తో దెబ్బ కొట్టినట్లే.. ఇప్పుడు కుమారుడిపై కూడా ఏమాత్రం కనికరం లేకుండా యార్కర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 45 ఏళ్ల లీ అక్కడే నిలబడి వేసిన బంతికి దీనికి మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. దాంతో ప్రెస్టోన్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బ్రెట్‌ లీ సోదరుడు, మాజీ క్రికెటర్‌ షేన్‌ లీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దాంతో లీ బౌలింగ్ వీడియో నెట్టింట వైరల్ అయింది. 


Also Read: Ruturaj Gaikwad - Chetan Sharma: రుతురాజ్‌ గైక్వాడ్‌ను అందుకే ఎంపిక చేశాం: చేతన్‌ శర్మ




బ్రెట్‌ లీ బౌలింగ్ (Brett Lee Bowling) వీడియోపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. 'వయసు పెరుగుతున్నా.. బ్రెట్‌ లీ బౌలింగ్‌లో పదును మాత్రం తగ్గలేదు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కుమారుడు అనే కనికరం లేకుండా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు' అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు. 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా (Australia) తరపున క్రికెట్‌ ఆడిన బ్రెట్‌ లీ.. అన్ని ఫార్మాట్లు కలిపి 718 వికెట్లు తీశాడు. ఆసీస్ తరపున లీ 76 టెస్టులు, 221 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో లీ సభ్యుడిగా ఉన్నాడు. పదేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రెట్‌ లీ.. కామెంటేటర్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. 


Also read: Bangarraju Teaser: ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే! నువ్ మన దేశానికే సర్పంచ్ కావాలె!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి