Nagarjuna and Naga Chaitanya's Bangarraju Teaser Out: కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం 'బంగార్రాజు' (Bangarraju). కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ (Ramya Krishna), కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బంగార్రాజు సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బింగ్‌తో హీరో, హీరోయిన్‌లు బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ జోడి నాగార్జున, రమ్యకృష్ణలు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
బంగార్రాజు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కొత్త ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని శనివారం చిత్ర యూనిట్ టీజర్ (Bangarraju Teaser)ని విడుదల చేసింది. టీజర్‌లో తండ్రీ తనయులు నాగార్జున (Nagarjuna), నాగచైతన్యలు డైలాగ్స్, మాటలతో అలరించారు. నాగార్జున ఎంట్రీతో టీజర్ ఆరంభం అయి.. నాగ్, నాగచైతన్యలు మీసాలు తిప్పడంతో ఎండ్ అయింది. సోగ్గాడే చిన్నినాయనే సినిమాలో నాగ్ కర్రను బండికి ఎలా తగిలిస్తాడో.. చై అచ్చు అలానే చేశాడు. 'ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే' అని రమ్యకృష్ణతో నాగార్జున చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఆ ఒక్క డైలాగ్ (Putiki Dialogue) సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
💐Wishing all my friends a fantastic New Year!!💐
Check out the teaser of #Bangarraju
👉 https://t.co/bEqK1sUSLG#Bangarrajuteaser#pandugalanticinema@chay_akkineni@kalyankrishna_k @fariaabdullah2@iamkrithishetty@anuprubens@AnnapurnaStdios @ZeeStudios_ @zeemusiccompany— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 1, 2022
ఇక నాగచైతన్య (Naga Chaitanya), కృతి శెట్టి (Krithi Shetty)ల మధ్య వచ్చే డైలాగ్స్ కూడా బాగున్నాయి. 'ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాళ్లు అలానే బెణుకుతాయి.. నెను దిష్టి తీయనా', 'నువ్ ఈ ఊరికే సర్పంచివి కాదు.. మన రాష్ట్రానికి సర్పంచివి కావాలి, దేశానికి సర్పంచివి కావాలి' అని చై చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా బంగార్రాజు టీజర్ బాగుంది. ఈ టీజర్‌ని చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అయింది. ఇప్పటికే వీడియోకి లైకుల వర్షం కురుస్తోంది. బంగార్రాజు చిత్రానికి స్క్రీన్‌ప్లే సత్యానంద్ కాగా.. సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. బంగార్రాజు టీజర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన నాగార్జున.. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
Also Read: Drunk and drive cases: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎఫెక్ట్- వేలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి