Kevin Pietersen thanks PM Modi: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ కెవిన్‌ పీటర్సన్‌ (Kevin Pietersen)కు భారత దేశం (India) అంటే చాలా ప్రేమ. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని అతడు తెలియజేస్తూనే ఉంటాడు. టీమిండియా క్రికెటర్లతో పాటు ఇక్కడి ప్రజలను ఇష్టపడుతుంటాడు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు కేపీ చాలా ఇష్టం. ఇక భారత 73వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా పీటర్సన్‌ దేశప్రజలందరికీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రెండు రోజుల క్రితం గణతంత్ర దినోత్సవం జరుపుకున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. గర్వించదగిన దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఓ పవర్‌హౌస్. భారతదేశం తన వన్యప్రాణులను సంరక్షించడంలో గ్లోబల్ లీడర్‌గా (PM Modi) ఉన్నందుకు కృతజ్ఞతలు. త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని ఎదురుచూస్తున్నాను' అని కెవిన్‌ పీటర్సన్‌ ఈరోజు ట్వీట్ చేశారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాటింగ్ ఐకాన్‌కు 'ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా' లేఖ అందిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి కేపీ కృతజ్ఞతలు తెలిపారు. 


Aslo Read: Kousalya Covid 19: కరోనా బారిన పడిన కౌసల్య.. తీవ్ర జ్వ‌రం, గొంతు నొప్పితో బాధపడుతున్న సింగర్!!


'ప్రియమైన నరేంద్ర మోదీ జీ.. మీరు నాకు రాసిన లేఖలోని మంచి మాటలకు ధన్యవాదాలు. 2003లో అడుగుపెట్టినప్పటి నుంచి భారత దేశంను ఇష్టపడుతున్నా. అక్కడకు వచ్చిన ప్రతిసారి మీ దేశంపై నాకు ఇంకా ప్రేమ పెరుగుతోనే ఉంది' అని కెవిన్ పీటర్సన్ తన ట్విట్టర్‌లో శుక్రవారం ఉదయం పోస్ట్ చేశారు. 'భారతదేశంలో మీకు ఏది చాలా ఇష్టమని ఇటీవల చాలా మంది నన్ను అడిగారు.. నా సమాధానం చాలా సింపుల్. భారతదేశ ప్రజలు నాకు చాలా ఇష్టం' అని కేపీ (KP) తెలిపారు. 



2004 మరియు 2014 మధ్య ఇంగ్లండ్ తరఫున కెవిన్‌ పీటర్సన్‌ 104 టెస్టులు, 136 వన్డేలు మరియు 37 టీ20లు ఆడారు. పీటర్సన్‌తో పాటు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్‌లకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత లేఖలు పంపారు. భారతదేశం పట్లరోడ్స్‌కు ఉన్న ఆప్యాయతను లేఖలో తెలియజేస్తూ.. భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య బలమైన సంబంధాల ప్రత్యేక రాయబారి అని పేర్కొన్నారు. 


Also Read: Rashmika Mandanna - Karan Johar: రష్మిక అందానికి స్టార్ ప్రొడ్యూసర్ ఫిదా.. భారీ ఆఫర్‌ ఇచ్చాడుగా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook