భారత మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్
భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, హీరోలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ప్రాణాంతక కోవిడ్19 మహమ్మారి బారిన పడుతున్నారు. భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ (Chetan Chauhan Tested COVID19 Positive)గా నిర్ధారించారు.
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (Chetan Chauhan) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు డాక్టర్లు కోవిడ్19 (COVID19) పాజిటివ్‌గా నిర్ధారించారు. చేతన్ చౌహాన్ త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా, పేసర్ ఆర్పీ సింగ్ ఆకాంక్షించారు. ‘చేతన్‌జీకి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఈ రోజు నిజంగానే కష్టమైన రాత్రి. బిగ్ బీ, చేతన్ జీలకు కరోనా’ అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు. ఆ న్యూమోనియాకు కరోనా వైరస్ కారణం: డబ్ల్యూహెచ్‌వో
‘చేతన్ చౌహాన్‌గారికి కరోనా వైరస్ పాజిటివ్ (COVID19 Positive for Chetan Chauhan)అని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ’ ఆర్పీ సింగ్ ట్వీట్ చేశాడు. చేతన్ చౌహాన్ భారత్ తరఫున 40 టెస్టులు, 7 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించాడు. 1970 దశకంలో సునీల్ గవాస్కర్‌కు ఓపింగ్ పార్ట్‌నర్‌గానూ చేతన్ చౌహాన్ ఫేమస్ అయ్యారు. అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్
కాగా, క్రికెట్‌కు వీడ్కోలు పలికిన చేతన్ చౌహాన్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా చేతన్ చౌహాన్ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos