Suresh Raina Dance To Srivalli Song: స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) కాంబినేషన్‌లో వచ్చిన ఆల్బమ్స్‌ ఎప్పుడూ సూపర్‌హిట్టే. ఆర్య, ఆర్య 2, S/O సత్యమూర్తి, డీజే సాంగ్స్ అందరినీ అలరించాయి. తాజాగా వచ్చిన 'పుష్ప' (Pushpa) అయితే వాటన్నింటిని మించిపోయింది. ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన పుష్ప సినిమాలో ప్రతి పాటా ఓ సెన్సేషనల్‌ అయ్యింది. ముఖ్యంగా శ్రీవల్లీ (Srivalli Song), ఊ అంటావా మావ పాటలు  యూట్యూబ్‌లో హిస్టరీ క్రియేట్‌ చేస్తున్నాయి. ఈ రెండు పాటలకు ప్రతిఒక్కరు కవర్‌ సాంగ్స్‌, రీల్స్‌, డాన్స్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (Suresh Raina) 'పుష్ప' సినిమాలోని శ్రీవల్లీ పాటకు స్టెప్పులేశాడు. తన ఇంట్లో హిందీలో పాట ప్లే అవుతుండగా.. అల్లు అర్జున్‌ స్టెప్పులను రైనా వేశాడు. అచ్చం అల్లు అర్జున్‌ను గుర్తుచేస్తూ అతనిలానే పాదాలను కదిలించిన రైనా (Suresh Raina Dance).. తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. రైనాతో పాటు మరో ఇద్దరు కూడా డాన్స్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియోను ఓ అభిమాని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అదికాస్త వైరల్ అయింది. 


Also Read: Horoscope Today January 23 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ కాలం, అప్రమత్తంగా ఉండాలి!!


సురేష్ రైనా 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రైనా భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. రైనా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో తనదైన ముద్ర వేశాడు. గత సీజన్ వరకు రైనా ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఆడాడు. అయితే ఐపీఎల్ 2022 (IPL 2022 Auction) మెగా వేలంకు ముందు మిస్టర్ ఐపీఎల్‌ను చెన్నై (CSK) రెటైన్ చేసుకోలేదు. దాంతో అతడు మెగా వేలంలోకి వచ్చాడు. 35 ఏళ్ల రైనా ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు.



కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ సురేష్ రైనాను తమ జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లక్నో నుంచి రైనాకు స్థానిక టచ్ కూడా ఉంది. మిస్టర్ ఐపీఎల్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు చెన్నై కూడా అతడికోసం పోటీపడే అవకాశం ఉంది. బ్యాటింగ్‌తో పాటు రైనా బౌలింగ్‌ కూడా చేయగలడు. కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ (IPL)లో 25 వికెట్లు కూడా తీశాడు.


Also Read: Viral video: దుబాయ్​ వీధుల్లో పురి విప్పిన నెమలి అందాలు.. వీడియో వైరల్​!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook