Praveen Kumar Fire on BCCI: ఫిట్ గా ఉన్నా రంజీల్లో ఆడకపోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిష‌న్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్(Central Contract)ను బీసీసీఐ ర‌ద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇప్పుడు భారత క్రికెట్‌లో పెను దుమారం రేపుతోంది. రంజీల్లో ఆడ‌కున్నా హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు కాంట్రాక్ట్ ఇవ్వ‌డంపై టీమిండియా మాజీ ఆటగాళ్లు బీసీసీఐను దుమ్మెత్తిపోస్తున్నారు.  ఇషాన్, అయ్య‌ర్‌ల‌కు ఒక న్యాయం.. పాండ్యాకు ఒక న్యాయ‌మా? అంటూ కడిగిపారేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) కూడా బీసీసీఐపై మండిపడ్డాడు. పాండ్యా ఏమైనా చంద్రుడిపై నుంచి దిగి వచ్చాడా? అంటూ విమర్శించాడు. మీ రూల్స్ ప్రకారం, ఫిట్ గా ఉన్నవారు దేశవాళీ క్రికెట్ ఆడాలి కదా పాండ్యా ఎందుకు ఆడలేదు? ఇషాన్, అయ్య‌ర్‌ల మాదిరిగా అతడి కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలేదు? అంటూ బీసీసీఐపై ధ్వజమెత్తాడు ప్రవీణ్ కుమార్. శుభంకర్ మిశ్రా అనే జర్నలిస్టు యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా విషయంలో బీసీసీఐ పెద్దలు కఠినంగా వ్యవహారించాల్సిందని.. అందరికీ సమానమైన నిబంధనలు వర్తింపజేయాలని ప్రవీణ్ అన్నాడు.


కాంట్రాక్ట్ ఇవ్వడానికి అదే కారణమా..
గతేడాది వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు హార్ధిక్. చీలమండ గాయంతో వరల్డ్ కప్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యే ఫిట్‌నెస్ సాధించాడు. గాయం నుంచి రికవరీ అయినప్పటికీ అతడు టెస్ట్ క్రికెట్ ఆడే పరిస్థితి లేదని..అయితే దేశీవాళీ క్రికెట్ ఆడతానని చెప్పడంతో సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కల్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐపీఎల్ హార్ధిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు. 


Also Read: Ranji Trophy 2024 winner: రంజీల్లో తిరుగులేని ముంబై.. 42వ సారి టైటిల్ కైవసం..


Also Read: IPL 2024: కేకేఆర్ కు బిగ్ షాక్.. తిరగబెట్టిన శ్రేయస్ వెన్నునొప్పి.. ఐపీఎల్‌కు డౌటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook