Ranji Trophy 2024 Final Match Highlights: ముంబై(Mumbai) 42వసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భ(Vidarbha)ను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అక్షయ్ వద్కార్(102) సెంచరీతో పోరాడినా.. ఆ జట్టును గెలిపించలేకపోయాడు. సెంచరీ హీరో ముషీర్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. తనుష్ కొటియాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.
స్వల్ప స్కోరుకే కుప్పకూలిన విదర్భ..
రంజీ ట్రోఫీ ఫైనల్లో మెుదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. పృథ్వీ షా(46), శార్థూల్ ఠాకూర్(75) మాత్రమే రాణించారు. హర్ష దుబే, యశ్ ఠాకూర్ మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత ముంబై బౌలర్ల ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో యశ్ రాథోడ్ (27) టాప్ స్కోరర్.
ముషీర్ సెంచరీ
అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై... ముషీర్ సెంచరీ(136)తో భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో సచిన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు ముషీర్. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీ పైనల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ (96) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ రహానే (73), ములానీ(50) హాఫ్ సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో 418 పరుగులకు ఆలౌటైంది. హార్ష దుబే ఐదు వికెట్లుతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని మెుత్తం 538 పరుగుల భారీ టార్గెట్ ను విదర్భ ముందు ఉంచింది రహానే సేన.
అద్భుతంగా పోరాడిన అక్షయ్, ధూబే..
రెండో ఇన్నింగ్స్ లో విదర్భకు ఓపెనర్లు ఓపెనర్లు అథర్వ తైడే(32), ధ్రువ్ శొరే(28)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కరుణ్ నాయర్(74) అద్భుతంగా ఆడాడు. అక్షయ్ వద్కర్(102) సెంచరీతో చెలరేగినా అతడికి సపోర్టు ఇచ్చేవారు కరవయ్యారు. హర్ష్ దుబే(65) సహకరమందించినా.. మిగతా వాళ్లు విఫలమయ్యారు. తనుష్ కొతియన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో విదర్భ 368 పరుగులకే ఆలౌటైంది. దీంతో 169 పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. తనుష్ కొతియన్ నాలుగు వికెట్లు, సెంచరీ హీరో ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తీశారు.
Also Read: IPL 2024: కేకేఆర్ కు బిగ్ షాక్.. తిరగబెట్టిన శ్రేయస్ వెన్నునొప్పి.. ఐపీఎల్‌కు డౌటే..!
Also Read: ICC Test Rankings: మళ్లీ నంబర్ వన్ గా అశ్విన్.. టాప్-10లోకి దూసుకొచ్చిన రోహిత్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి