Virender Sehwag: నీ దగ్గర ఉన్న నోట్ల కంటే.. నా జుట్టే ఎక్కువగా ఉంది: అక్తర్‌కు సెహ్వాగ్ దిమ్మతిరిగే కౌంటర్
Virender Sehwag Vs Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు నోటి దూల ఎక్కువే అని అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు టీమిండియా క్రికెటర్లపై నోరు పారేసుకుంటూ ఉంటాడు. గతంలో అక్తర్ చేసిన కామెంట్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
Virender Sehwag Vs Shoaib Akhtar: ఇండియా-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎంతో క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆటగాళ్లు మైదానంలోనే కాదు.. బయట కూడా తమ నోటికి పని చెబుతుంటారు. ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్-పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మధ్య గ్రౌండ్‌లో వైరం ఎలా ఉంటుందో క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. షోయబ్ అక్తర్ కవ్విస్తూ బౌన్సర్లు వేస్తే.. వీరేంద్ర సెహ్వాగ్ చూడముచ్చటగా అప్పర్ కట్‌తో సిక్సర్లు బాదడం చూశాం. వీరిద్దరి మధ్య బయట మంచి స్నేహమే ఉంది. అయితే అప్పుడప్పుడు మాత్రం తన నోటికి పనిచెబుతుంటారు.
సెహ్వాగ్ తలపై జుట్టు కంటే తన వద్ద ఎక్కువ డబ్బులు ఉన్నాయంటూ గతంలో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు వీరూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. యూట్యూబ్ షో ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’లో అక్తర్ చేసిన ప్రకటనపై స్పందించాడు. ఇప్పుడు అక్తర్ వద్ద ఉన్న నోట్లు కంటే.. తన తలపైనే ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయంటూ సెటైర్లు వేశాడు.
షోయబ్ అక్తర్‌కి మీకు స్నేహం ఉందా..? అని షోలో సెహ్వాగ్‌ని ప్రశ్నించారు. మాజీ డాషింగ్ ఓపెనర్ స్పందిస్తూ.. "ప్రేమ ఉన్నచోట.. సరదాగా, ఉల్లాసంగా ఉంటుంది. నేను 2003-04లో షోయబ్ అక్తర్‌తో మాట్లాడాను. మేము రెండు సార్లు అక్కడికి వెళ్లాం. పాక్ జట్టు ఇక్కడికి రెండుసార్లు వచ్చింది. మేము స్నేహితులం. సెహ్వాగ్ తలపై ఉన్న వెంట్రుకల కంటే నా వద్ద ఎక్కువ నోట్లు ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపాడు. ఇప్పుడు నా జుట్టు మీ నోట్ల కంటే ఎక్కువ ఉంది.." అంటూ వీరేంద్రుడు సిక్సర్ బాదిన రీతిలో కౌంటర్ ఇచ్చాడు. సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టీమిండియాకు మూడు ఫార్మాట్స్‌లో ప్రాతినిధ్యం వహించిన సెహ్వాగ్.. అంతర్జాతీయ కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేయగా.. వన్డేలలో 35.05 సగటుతో 8273 రన్స్ చేశాడు. టీ20ల్లో 145.38 స్ట్రైక్ రేట్‌తో 394 పరుగులు చేశాడు. టెస్టులు టీమిండియాతో తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ సెహ్వాగ్ చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి