Ruturaj Gaikwad Utkarsha Pawar: మహిళా క్రికెటర్‌ను పెళ్లి చేసుకున్న రుతురాజ్.. బ్యూటిఫుల్ పిక్స్ చూశారా..!

Ruturaj Gaikwad Utkarsha Pawar Wedding Pics: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను శనివారం వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వేడుకగా ఎంతో గ్రాండ్‌ జరిగింది. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రుతురాజ్. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
 

1 /6

ఈ ఏడాది సీఎస్‌కే టైటిల్ గెలవడంలో రుతురాజ్ గైక్వాడ్ కీ రోల్ ప్లే చేశాడు. ట్రోఫీని గెలుచుకున్న వారం రోజుల వ్యవధిలోనే తన స్నేహితురాలు ఉత్కర్ష పవార్‌ను వివాహం చేసుకున్నాడు. 

2 /6

రుతురాజ్, ఉత్కర్ష పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మేడ్ ఫర్ ఈచ్ ఆదర్, క్యూట్ కపుల్ అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చిరకాలం సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నారు.   

3 /6

ఉత్కర్ష, రుతురాజ్ ఒకరినొకరు చూసుకుని నవ్వుతున్నప్పుడు క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్ అయింది. వీరి మధ్య ప్రేమ ఎంత అందమైనదో ఫొటోలను చూస్తుంటే అర్థమవుతోంది.   

4 /6

రుతురాజ్ మనీష్ మల్హోత్రా రూపొందించిన డ్రెస్ ధరించగా.. ఉత్కర్ష పల్లోడ్ క్రియేషన్స్ లెహంగాలో అద్భుతంగా రెడీ అయింది   

5 /6

ఉత్కర్ష కూడా క్రికెటర్. ఆమె మహారాష్ట్ర తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది. అయితే ఆమె రెండేళ్లుగా ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. 2021 నవంబర్ 15న ఉత్కర్ష చివరి ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడింది. 

6 /6

రుతురాజ్ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో దుమ్ములేపాడు. 16 మ్యాచ్‌ల్లో 147.50 స్ట్రైక్ రేట్‌తో 590 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి.