వెల్లింగ్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో వరుస విజయాలు సాధించిన భారత్‌కు న్యూజిలాండ్ జట్టు చెక్ పెట్టింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సేనపై 10 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్ 200 స్కోరు చేయలేదంటే జట్టు ఎంతలా వైఫల్యం అయిందో చెప్పవచ్చు. తొలి టెస్టు విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి టెస్టు విజయంతో కివీస్ అరుదైన, మరే ఇతర జట్టుకు దక్కని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. క్రికెట్‌లో ప్రాముఖ్యత ఉన్న ఐసీసీ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుపై కివీస్ హవా కొనసాగుతోంది. ఐసీసీ మేజర్ ఈవెంట్ గత 4 మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు పరాభవం తప్పలేదు. అది కూడా అన్ని ఐసీసీ ఈవెంట్ ఫార్మాట్లు (ట్వంటీ20, వన్డే, టెస్టులు)లో ఆధిపత్యం ప్రదర్శించిన ఏకైక జట్టు కివీస్ కావడం గమనార్హం. భారత కెెప్టెన్లుగా ఎంఎస్ ధోనీ గతంలో రెండు పర్యాయాలు (2007, 2016లలో) విఫలం కాగా, వరుసగా రెండు పర్యాయాలు విరాట్ కోహ్లీ వైఫల్యం చెందాడు.


Also Read: భారత్‌కు మరో పరాభవం.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తొలి దెబ్బ


తొలి ఓటమి: 2007లో తొలి టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో డానియెల్ వెటోరి 4 వికెట్లతో చెలరేగడంతో భారత్ 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ టోర్నీలో భారత్‌ను ఓడించిన ఏకైక జట్టు కివీస్.


రెండో ఓటమి: 2016లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ ను భారత బౌలర్లు 126/7కు పరిమితం చేశారు. కానీ ఛేదనలో భారత్ తడబడింది. కివీస్ స్పిన్ త్రయం మిచెల్ శాంట్నర్, నాథన్ మెకల్లమ్, ఇష్ సోధీలు కలిపి 6 వికెట్లు తీయడంతో భారత్ 79 పరుగులకే పరిమితమై ఇంటిదారి పట్టింది.


మూడో ఓటమి: 2019 వన్డే వరల్డ్ కప్ ఇప్పటికీ భారతీయులకు పీడకలలా మిగిలింది. సెమీ ఫైనల్లో 240 పరుగుల టార్గెట్ ఛేదించలేక భారత్ చతికిల పడింది. టోర్నీ ఆసాంతం రాణించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడం, టాపార్డర్, మిడిలార్డర్ విఫలం కావడం భారత్‌ను దెబ్బతీసింది. రవీంద్ర జడేజా మెరుపులతో భారత్ దాదాపు విజయానికి చేరువైంది. జడేజా, ధోనీ వెనువెంటనే ఔట్ కావడంతో ఐసీసీ మేజర్ టోర్నీలో మూడో ఓటమి చవిచూసింది.


Also Read: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు రాస్ టేలర్ 


నేడు నాలుగో ఓటమి: నేడు టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరిగిన వెల్లింగ్టన్ టెస్టులో 10 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. దాంతో వరుసగా 7 మ్యాచ్ లు నెగ్గిన భారత్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో తొలిసారి ఓటమి రుచి చూసింది. అది కూడా ప్రత్యర్థి కివీస్ చేతిలోనే. కాగా, 2003 వరల్డ్ కప్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గడమే కివీస్‌పై నెగ్గడమే భారత్‌కు ఆ జట్టుపై ఓ ఐసీసీ ఈవెంట్‌లో చివరి విజయం.


See Pics: టాప్ లేపిన ముద్దుగుమ్మలు!


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..