భారత్‌కు మరో పరాభవం.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తొలి దెబ్బ

టెస్టు ఛాంపియన్ షిప్‌లో అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్న భారత్ జైత్రయాత్రకు ఆతిథ్య న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. వెల్లింగ్టన్ టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

Last Updated : Feb 24, 2020, 10:26 AM IST
భారత్‌కు మరో పరాభవం.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తొలి దెబ్బ

వెల్లింగ్టన్: టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో వరుస విజయాల జైత్రయాత్రకు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు చెక్ పెట్టింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. నాలుగో రోజే భారత్ టెస్ట్ మ్యాచ్‌ను కోల్పోవడం గమనార్హం. కాగా తొలిరోజు నుంచే ఆతిథ్య జట్ట విరాట్ కోహ్లీ సేనపై పైచేయి సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Also Read: ఐపీఎల్ 2020 షెడ్యూల్.. తొలి, చివరి మ్యాచ్ వారిదే! 

నాలుగో రోజైన సోమవారం 144/4తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో నాలుగు పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అజింక్య రహానే (29; 75 బంతుల్లో 5x4), తెలుగు తేజం హనుమ విహారి (15; 79 బంతుల్లో 2x4) త్వరగా ఔటయ్యారు. రిషభ్‌ పంత్‌ (25), అశ్విన్‌(4), ఇషాంత్‌ శర్మ (12), మహ్మద్‌ షమీ(2), జస్ప్రీత్‌ బుమ్రా(0) వికెట్లు తీయడానికి కివీస్ బౌలర్లకు అంత ఇబ్బంది కలగలేదు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ 191 పరుగులకు ముగిసింది.

Also Read: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు రాస్ టేలర్ 

తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 183 పరుగుల ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసింందే. దీంతో రెండో ఇన్నింగ్స్ వికెట్ నష్టపోకుండా కివీస్ 9 పరుగులు చేసి తొలి టెస్టులో విజయాన్ని అందుకుంది. కాగా, కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ (5 వికెట్లు), ట్రెంట్‌ బౌల్ట్‌(4వికెట్లు) తో అదరగొట్టగా.. కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌‌కు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు.. ఓవరాల్‌గా  9వికెట్లతో రాణించిన సౌథీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

కాగా, ఇటీవల జరిగిన ఐదు ట్వంటీ20ల సిరీస్‌ని 5-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేయగా.. అనంతరం జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కివీస్ చేతిలో 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైన విషయం తెలిసిందే.

ఓవరాల్‌గా...
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 165 ఆలౌట్‌

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 348 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 191 ఆలౌట్‌

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 9-0

 

See Pics: టాప్ లేపిన ముద్దుగుమ్మలు!

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News