French Open: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సంచలనం నమోదు అయ్యింది. పురుషుల విభాగంలో వరల్డ్ నెంబర్‌ వన్‌కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్‌లో జకోవిచ్‌పై స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో 6-2,4-6,6-2,7-6 తేడాతో అదరగొట్టాడు. నువ్వానేనా అన్నట్లు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీలో రఫెల్ నాదల్ సెమీస్‌కు 15 సార్లు వెళ్లాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గెలవడం ద్వారా జకోవిచ్‌పై నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. గతేడాది సెమీ ఫైనల్‌లో నాదల్ ఓడిపోయాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలి సెమీ ఫైనల్‌లో నాదల్,  జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. జకోవిచ్‌తో తలపడటం అతి పెద్ద సవాల్ అని రఫెల్ నాదల్ అన్నాడు. అతడిని ఓడించడం అంటే మాములు విషయం కాదని అభిప్రాయపడ్డాడు. మొదటి నుంచి చివరి వరకు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని చెప్పాడు. 


మ్యాచ్‌ అనంతరం రఫెల్ నాదల్ మాట్లాడాడు. ఎన్నో భావోద్వేగాలు తనను  చుట్టుముట్టాయని..ఇక్కడ ఆడటం ఎప్పుడు ప్రత్యేకమేనని అన్నాడు. నాదల్‌కు జకోవిచ్ అభినందనలు తెలిపాడు. అతనో గొప్ప ఛాంపియన్ అని అభివర్ణించాడు. ఆటలో తనకంటే మెరుగ్గా ఆడాడని చెప్పాడు. విజయానికి నాదల్‌ అర్హుడని తెలిపాడు.


Also read:India Corona: దేశంలో కరోనా ఆందోళన కల్గిస్తోందా..? యాక్టివ్‌ కేసులు ఎన్నంటే..!


Also read:Vijayawada: విజయవాడలో గ్యాంగ్ వార్.. ఫుట్‌బాల్ ప్లేయర్‌ను కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు    


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook