Kohli Captaincy Exit: ఈ సమయంలో ఆ నిర్ణయమేంటని కోహ్లీపై గంభీర్ ఆగ్రహం
ఐపిఎల్ 2021 సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ ఆర్‌సిబి కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే, కోహ్లీ హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Kohli leaving RCB captaincy: భారత టీ 20 కెప్టెన్సీ (T-20 Captancy) నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో పెద్ద నిర్ణయంతో అందరినీ షాక్ కు గురి చేసాడు. అదేంటంటే కోహ్లీ ఐపిఎల్‌లో ఆర్‌సిబి జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాలకునే (Kohli exit from RCB Captaincy) నిర్ణయం. ఈ ఐపిఎల్ 2021 సీజన్ (IPL 2021 Season) తర్వాత, విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఆర్‌సిబి కెప్టెన్సీ (RCB Captaincy) నుంచి తప్పుకోనున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోహ్లీని నిర్ణయాన్ని ఖండించిన గంభీర్
విరాట్ కోహ్లీ మరియు గౌతమ్ గంభీర్ మధ్య సంబంధం మరి అంత చెప్పుకోదగ్గ గొప్పగా ఏమి లేదు. ఆర్‌సిబి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన తరువాత గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. స్టార్ స్పోర్ట్స్‌లో గంభీర్ మాట్లాడుతూ, 'అవును, ఈ నిర్ణయం చూసి నేను ఆశ్చర్యపోయాను, టోర్నమెంట్ రెండవ దశకు ముందు ఈ నిర్ణయం తీసుకోవాల్సింది లేదా టోర్నమెంట్ ముగిసిన తర్వాత మీరు ఈ నిర్ణయం ప్రకటించాల్సింది. టోర్నమెంట్ ప్రారంభమయ్యాక ఇలాంటి నిర్ణయాలు జట్టులోని వారికి కొంత అశాంతికి మరియు భావోద్వేగానికి గురి చేస్తుందని తెలిపారు.
Also Read: Bigg Boss 15: హాట్ టాఫిక్ గా సల్మాన్ రెమ్యూనరేషన్..బిగ్‌బాస్ 15 సీజన్ కోసం రూ.350 కోట్లా...!
'కోహ్లీ జట్టుపై ఒత్తిడి పెంచాడు'
గౌతమ్ గంభీర్ తెలిపిన దాని ప్రకారం, విరాట్ కోహ్లీ ఇలా చేయడం వలన RCB జట్టు ఆటతీరుపై ప్రభావం పడుతుంది. గంభీర్ మాట్లాడుతూ, 'ఈ ఐపిఎల్ (IPL) సీజన్‌లో ఆర్‌సిబి (RCB) చాలా మంచి స్థితిలో ఉంది. మీరు జట్టుపై అదనపు ఒత్తిడి ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, విరాట్ కోసం టైటిల్ గెలవాలన్న ఆలోచన జట్టుపై అదనపు ఒత్తిడి పెంచుతుంది. జట్టుకు నేను తెలిపేది ఒకటే... ఒక వ్యక్తికి కోసం టైటిల్ గెలవాల్సిన అవసరం లేదు... మీకు దేవుడితో సమానమైన ఫ్రాంచైజీ కోసం ఐపిఎల్ టైటిల్ గెలవాలని" తెలిపారు
వారంలో రెండు పెద్ద నిర్ణయాలు
'విరాట్ కోహ్లీ (Virat Kohli) టోర్నమెంట్ తరువాత కూడా ఈ నిర్ణయం తీసుకోవచ్చు... తన ఆటలో వస్తున్న మార్పు, సరిగా ఆడలేని కారణంగా భారత టీ 20 జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు, అదే విధంగా తాను టి 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతానని తెలిపాడు" ఇలాంటి నిర్ణయాలు టోర్నమెంట్ అయ్యాక చెప్తే బాగుంటుంది. ముందు చెప్పటం వలన జట్టుపై భారం పరుగుతుంది అని గౌతం అన్నారు.
Also Read: Virat Kohli: ఐపిఎల్ 2021 తర్వాత RCB కెప్టేన్‌గా వైదొలగనున్న విరాట్ కోహ్లీ
ఈ ఐపిఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సిబి (Royal Challengers Bangalore) 7 మ్యాచుల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉందని మనకు తెలిసిందే. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఆర్‌సిబి కనీసం 3 మ్యాచ్‌లు గెలిచినా సరిపోతుంది. ఈ రోజు జరగనోయే మ్యాచ్ లో ఆర్‌సిబి- కోల్‌కతా నైట్ రైడర్స్‌తో దుబాయ్‌లో మ్యాచ్ ఆడనుంది.
కోహ్లీ సారథ్యంలో ఒక్కసారి కూడా కప్పు గెలవని ఆర్‌సిబి
ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకరైన విరాట్ కోహ్లీ వారంలో రెండు జట్ల కెప్టెన్సీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడని తెలిదిందే. గత వారం, టీ 20 వరల్డ్ కప్ 2021 తర్వాత భారత టీ 20 కెప్టెన్ పదవి నుంచి వైదొలగుతానని విరాట్ ప్రకటించాడు. 19 సెప్టెంబర్ (ఆదివారం) ఐపీఎల్ 2021 రెండో దశ పూర్తయ్యాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్సీ నుంచి వైదోలగానున్నట్లు ప్రకటించాడు.
Also Read: Covaxin: కోవాగ్జిన్ భవితవ్యం తేలేది అక్టోబర్ 6న, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం కీలక భేటీ
RCB యాజమాన్యం షేర్ చేసిన వీడియోలో IPL 2021 కెప్టెన్సీకి చివరి సీజన్ అని కోహ్లీ తెలిపాడు. ఏడేళ్ళుగా ఆర్‌సిబికి (RCB) కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ, ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవటం అందరిని నిరాశకు గురి చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook