Virat Kohli: ఐపిఎల్ 2021 తర్వాత RCB కెప్టేన్‌‌గా వైదొలగనున్న విరాట్ కోహ్లీ

Virat kohli to quit RCB captaincy after IPL 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడేంత వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (Royal Challengers Bangalore) ఆటగాడిగానే కొనసాగుతానని తేల్చిచెప్పాడు.

Written by - Pavan | Last Updated : Sep 20, 2021, 06:34 AM IST
Virat Kohli: ఐపిఎల్ 2021 తర్వాత RCB కెప్టేన్‌‌గా వైదొలగనున్న విరాట్ కోహ్లీ

Virat kohli to quit RCB captaincy after IPL 2021: విరాట్ కోహ్లీ ఐపిఎల్ 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టేన్‌గా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. అవును.. ఇది నిజం. ఇది ఎవరో చెప్పిన విషయమో లేక ఊహాగానాలో కాదు.. స్వయంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టేన్ విరాట్ కోహ్లీనే ఈ విషయాన్ని ప్రకటించాడు. ఐపిఎల్ 2021 సీజన్‌లో మిగిలి ఉన్న మ్యాచ్‌లు పూర్తి చేసేందుకు నిన్న 19వ తేదీ నుంచి ఐపిఎల్ 2021 తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భవిష్యత్‌లో తాను IPL 2021 సీజన్ పూర్తయిన తర్వాత కెప్టేన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విడుదల చేసిన ఓ అధికారిక వీడియో ద్వారా స్పష్టంచేశాడు.

ఐపిఎల్ 2021 తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టేన్‌గా దిగిపోనున్నట్టు చెప్పిన విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు తనకు సహకరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యానికి, ఆటగాళ్లకు, కోచ్‌లకు, సిబ్బందికి, అభిమానులకు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపాడు. కెప్టేన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడేంత వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (Royal Challengers Bangalore) ఆటగాడిగానే కొనసాగుతానని తేల్చిచెప్పాడు.  

Also read : Rohit Sharma: ఆ మూడూ కొట్టేస్తే.. హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డ్​!

విరాట్ కోహ్లీ (Virat Kohli) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టేన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం వచ్చే సీజన్‌లో ఆ జట్టుకు రాబోయే కొత్త కెప్టేన్ ఎవరనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ జట్టు ఆటగాళ్లలో ఆ తర్వాత కెప్టేన్ అయ్యేంత శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయనే అంశంలో అప్పుడే సోషల్ మీడియాలో అనేక చర్చలు మొదలయ్యాయి. ఏదేమైనా వచ్చే ఏడాది ఐపిఎల్ 2022 సీజన్ వేలం ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త కెప్టేన్ (Who will be RCB new captain after Virat Kohli ?) ఎంపిక విషయంలో గోప్యత పాటించే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తోంది.

Also read : Kohli Step Down From T20 Captain: కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News