Rishabh Pant: ప్రపంచకప్ సమీపిస్తోన్న వేళ.. ఇలా ఆడితే ఎలా పంత్! శ్రీకాంత్ అసంతృప్తి
Kris Srikkanth fires on Rishabh Pant over Poor Performance. రిషబ్ పంత్ తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడని బీసీసీఐ మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ శ్రీకాంత్ అన్నాడు.
Kris Srikkanth warning to Rishabh Pant over Poor Performance: భారత వికెట్‌కీపర్ రిషబ్ పంత్ తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాడని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. ఇటీవలి కాలంలో పంత్ ప్రదర్శన తననెంతో నిరాశపరుస్తోందన్నాడు. ప్రపంచకప్ సమీపిస్తోన్న వేళ సరిగా ఆడలేకపోతున్నాడనే విమర్శలు మంచివి కాదని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పంత్‌కు కొంత విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు.
గతకొంత కాలంగా రిషబ్ పంత్ పరుగులు చేయలేకపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా విఫలమవుతూనే ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో కూడా పంత్ నిరూపించుకోలేకపోయాడు. సూపర్ 12లో భాగంగా జింబాబ్వే మ్యాచ్‌లో 5 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్‌తో జరిగిన కీలక సెమీస్ మ్యాచ్‌లో 4 బంతుల్లో 6 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో పంత్ 23 బంతుల్లో 15 పరుగులు చేశాడు. దాంతో పంత్‌పై విమర్శల వర్షం కురుస్తోంది.
'రిషబ్ పంత్‌కు ఆట నుంచి కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఇది. భారత టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. పంత్‌కు విరామం ఇచ్చి.. 2-3 మ్యాచ్‌లకు దూరం చేయాలి. లేదా రెండు మ్యాచ్‌లు ఆడించి తొలగించాలి. ఇది బీసీసీఐ నిర్ణయించుకోవాలి.పంత్ సైతం తనకొచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం లేదు. నేను ఈ విషయంలో చాలా నిరాశతో ఉన్నాను. పంత్ ఇలాగైతే ఎలా?. ప్రపంచకప్ సమీపిస్తోన్న వేళ సరిగా ఆడలేకపోతున్నాడనే విమర్శలు మంచివి కాదు. ఇప్పటికే పంత్ ఆటతీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. యువ వికెట్ కీపర్ తనను తాను కొత్తగా నిరూపించుకోవాలి' అని కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు.
Also Read: యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్‌లో 7 సిక్సులు! కొట్టింది మనోడే
Also Read: Bandi Sanjay: బండి సంజయ్‌కు ఊరట.. పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.