Kylian Mbappe wins FIFA World Cup 2022 Golden Boot award: ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్ చాలా ఆసక్తికరంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం చివరకు అర్జెంటీనానే వరించింది. ఖతార్‌ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండిగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల టైటిల్ నిరీక్షణ ఫలించింది. అంతేకాదు ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సి స్వప్నం సాకారమైంది. ప్రపంచకప్‌లో అన్నిటికెల్లా ఉత్తమం అనిపించేలా సాగిన 2022 టైటిల్ అందుకుని.. పీలే, మారడోనాలున్న ‘ఆల్‌టైం గ్రేట్‌’ క్లబ్‌లో మెస్సి అడుగు పెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జెంటీనా తరఫున లియోనెల్‌ మెస్సి రెండు గోల్స్‌ (23 పెనాల్టీ, 108 పెనాల్టీ) గోల్స్‌ కొట్టగా.. డిమారియా (36వ) ఓ గోల్‌ కొట్టాడు. ఫ్రాన్స్‌ తరఫున కిలియన్‌ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. నిర్ణీత సమయంలో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ జట్లు చెరో రెండు గోల్స్‌ చేయడంతో విజేతను నిర్ణయించేందుకు ఎక్స్‌ట్రా టైమ్‌ ఇచ్చారు. అందులోనూ ముందుగా అర్జెంటీనా గోల్‌ కొట్టడంతో.. ఇక మెస్సీ సేన గెలుపు ఖాయమే అనుకున్నారు. అయితే ఎంబాపే అద్భుత రీతిలో గోల్‌ కొట్టి 3-3తో స్కోర్లు సమం చేశాడు. ఆపై పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించగా అర్జెంటీనాను విజయం వరించింది.


ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత 'గోల్డెన్ బూట్' అవార్డును ఇస్తారన్న విషయం తెలిసిందే. ప్రతి ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ ఇస్తారు. ఈ సంవత్సరం ఫ్రాన్స్‌ స్టార్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపే ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సిని సైతం వెనక్కి నెట్టి గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఎంబాపే అత్యధికంగా ఎనిమిది గోల్స్‌ బాదాడు. మెస్సి ఏడు గోల్స్‌ చేశాడు. 



ఫిఫా ప్రపంచకప్ 2022 ఫైనల్‌కు ముందు కైలియన్ ఎంబాపే, లియోనెల్  మెస్సిలు గోల్డెన్ బూట్ రేసులో నిలిచారు. ఇద్దరి చెరో 5 గోల్స్ చేసి సమానంగా ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేశాడు. ఎంబాపే హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఈ రేసులో  మెస్సిని వెనక్కి నెట్టాడు. ఎంబాపే ఏడు మ్యాచ్‌ల్లో 8 గోల్స్ చేయగా.. మెస్సి సైతం ఏడు మ్యాచ్‌ల్లో 7 గోల్స్ చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఒలివర్ గిరౌడ్, అర్జెంటీనాకు చెందిన జూలియన్ అల్వారెజ్ చెరో నాలుగు గోల్స్‌తో మూడో స్థానంలో నిలిచారు. 2018లో జరిగిన ఫిఫా ప్రపంచకప్లో  ఈ అవార్డును ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌కు దక్కింది. 


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!  


Also Read: New Year: న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్త.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.