2028 Los Angeles Olympics: గుడ్ న్యూస్ .. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..
Olympic Games: క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ను చేర్చేందుకు ఐఓసీ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటనను శుక్రవారం ఐఓసీ విడుదల చేసింది.
Cricket Included In 2028 Los Angeles Olympics: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒలింపిక్స్‌లో కొత్తగా 5 క్రీడలను చేర్చాలనుకున్నారని.. దాంట్లో క్రికెట్ కూడా ఉందని.. ఆ ప్రతిపాదనకు లాస్ ఏంజిల్స్ నిర్వాహకులు ఆమోదించినట్లు థామస్ బాచ్ పేర్కొన్నారు. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ క్రీడలతోపాటు క్రికెట్ ను కూడా ఒలింపిక్స్‌లో ఆడించే ఛాన్సు ఉంది.
దాదాపు 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. చివరిసారి 1900 సంవత్సరంలో పారిస్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ను ఆడించారు. ఆ ఏడాది ఫైనల్లో ఫ్రాన్స్‌పై బ్రిటన్ గెలిచింది. ఆ రోజుల్లో రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జరిగేవి. ప్రతి టీమ్ లో 12 మంది ఆటగాళ్లు ఉండేవారు. అయితే లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్ ఆడించే అంశంపై అధికారికంగా తుది ప్రకటన సోమవారం వెలుబడే అవకాశం ఉంది. రీసెంట్ గా ఆసియా గేమ్స్-2023 లో క్రికెట్ ఆడేందుకు అనుమతించారు. బీసీసీఐ తొలిసారి క్రికెట్ జట్లను చైనాకు పంపించిన సంగతి తెలిసిందే. హోంగ్జూలో టీ20 ఫార్మాట్ లో జరిగిన ఈ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.