Greg Chappell Praises MS Dhoni Leadership Skills: ప్రతి జట్టులోనూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) లాంటి సహజ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండాలని ఆస్ట్రేలియా మాజీ సారథి గ్రెగ్‌ ఛాపెల్‌ (Greg Chappell) అన్నారు. సహజ వాతావరణంలో ఆట నేర్చుకునేవాళ్లే ఎక్కువ కాలం నిలబడతారని, మహీ అలాంటి ఆటగాడే అని పేర్కొన్నారు. ధోనీ లాంటి ఆటగాళ్లు తగ్గిపోతుండటం వల్లే ప్రస్తుతం ఉన్న చాలా జట్లు ఇబ్బంది పడుతున్నాయని చాపెల్‌ అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2004 డిసెంబరులో ఎంఎస్ ధోనీ 23 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. అప్పుడు మహీ పవర్ హిట్టింగ్‌కి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. స్వచ్ఛమైన క్రికెట్ షాట్లు కాకుండా.. సహజమైన షాట్లు ఆడేవారు. ఇలానే పాకిస్తాన్, శ్రీలంక జట్లపై భారీ స్కోర్లు నమోదు చేశారు. సంవత్సరాలు గడిచేకొద్ధి బ్యాటింగ్‌లో మహీ చాలా మార్పులు చేసుకున్నారు. సీనియర్ల నుంచి, పరిస్థితుల నుంచి నేర్చుకుని తన నైపుణ్యాలను పెంచుకున్నారు. ఈ కమ్రంలోనే వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేశారు. అంతేకాదు క్రికెట్ ఆటలో అత్యుత్తమ సారథిగా పేరు తెచ్చుకున్నారు. 


Also Read: Ram Charan - Keerthy Suresh: కీర్తి సురేష్‌కి పడిపోయిన మెగా హీరో.. నాటునాటు మాములుగా లేదుగా!!


'అభివృద్ధి చెందిన క్రికెట్‌ దేశాలు క్రమక్రమంగా సహజ వాతావరణాన్ని కోల్పోతున్నాయి. యువ క్రికెటర్లు సహజ వాతావరణం నుంచే ఎదుగుతారు. బాగా ఆడే ఆటగాళ్లను చూస్తూ కుటుంబ సభ్యులు, క్రికెటర్లతో సరదాగా గడుపతూ ఆట నేర్చుకుంటారు. భారత్,  ఉపఖండ దేశాల్లో ఇంకా అలాంటి వాతావరణం ఉంది. చిన్న పట్టణాల్లో శిక్షణ సౌకర్యాలు తక్కువ. అక్కడ వీధుల్లో, పొలాల్లో ఎక్కువగా క్రికెట్‌ ఆడుతుంటారు. సంప్రదాయ కోచింగ్‌ పద్ధతుల్ని పాటించరు. ప్రస్తుత స్టార్లు చాలామంది అలా ఆట నేర్చుకున్న వాళ్లే. ఎంఎస్ ధోనీ ఇందుకు సరైన ఉదాహరణ' అని ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోకు రాసిన ఓ కాలమ్‌లో గ్రెగ్‌ ఛాపెల్‌ పేర్కొన్నారు. 


'ఎంఎస్ ధోనీ తన ప్రతిభ, శైలిని తనకు తాను తెచ్చుకున్నవే. మహీ అరంగేట్ర సమయంలో ఎలాంటి క్రికెట్ షాట్లు ఆడాడో మనకు తెలుసు. ఆపై సీనియర్ల నుంచి, పరిస్థితుల నుంచి నేర్చుకుని తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. నాకు తెలిసిన అత్యంత చురుకైన క్రికెట్‌ బుర్రల్లో అతడిది ఒకటి. అతడి లాంటి ప్లేయర్ ప్రతి జట్టులో ఉండాలి. ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిపోవడానికి కూడా సహజ వాతావరణం క్రికెట్‌ నేర్చుకున్న ఆటగాళ్లు జట్టులో లేకపోవడమే' అని గ్రెగ్‌ అభిప్రాయపడ్డారు.


Also Read: Kohli - Manjrekar: అభిమానులకు ఐసీసీ ట్రోఫీలు కావాలి.. ర్యాంకులు కాదు! బీసీసీఐకి మంజ్రేకర్ మద్దతు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook