Sanjay Manjrekar On Virat Kohli's Captaincy: విరాట్ కోహ్లీ (Virat Kohli)ని టీమిండియా వన్డే కెప్టెన్సీ (ODI Captaincy) నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ మండలి (BCCI)కి మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మద్దతుగా నిలిచాడు. జట్టు సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీని తొలగించి రోహిత్ శర్మ (Rohit Sharma)కు అప్పగించిన బీసీసీఐ నిర్ణయం సరైందేనన్నాడు. అభిమానులు ఐసీసీ ప్రపంచకప్ (ICC World Cups)లను గెలవాలని కోరుతున్నారని, అందుకే కోహ్లీని బీసీసీఐ తప్పించి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉండటం సరైందేనా అన్న ప్రశ్నకు సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) మాట్లాడుతూ... 'అభిమానులు టీమిండియా ఐసీసీ ప్రపంచకప్ ట్రోఫీలు గెలవాలని కోరుకుంటున్నారు. అంతేకానీ ర్యాంకులు, సిరీస్‌లు కాదు. అందుకే కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు' అని అన్నాడు. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం దక్కించుకుంది కానీ ఒక్క ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. గతేడాది జరిగిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Also Read: Horoscope Today January 27 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పూర్తి మిశ్రమకాలం!!
ఐపీఎల్ 2021 అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Captaincy) కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'ఆర్‌సీబీకి కోహ్లీ నాయకత్వం కొనసాగించి ఉంటే బాగుండేది. అతడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. అందుకే వన్డేలు, టెస్టుల్లో కచ్చితంగా సారథ్య బాధ్యతలను నిర్వర్తించాలని అనుకుని ఉంటాడు. అయితే బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి షాక్ ఇచ్చింది. కోహ్లీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతుండటంతో టెస్టు నాయకత్వానికి గుడ్‌బై చెప్పి ఉండొచ్చు' అని పేర్కొన్నాడు.
Also Read: Ind vs WI: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook