Muttiah Muralitharan Angry: మార్కో జాన్సెన్ చెత్త బౌలింగ్.. బూతులు తిట్టిన సన్‌రైజర్స్ కోచ్ (వీడియో)
GT vs SRH IPL 2022, Muttiah Muralitharan angry on Marco Jansen. చెత్త బౌలింగ్ వేసిన మార్కో జాన్సెన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Muttiah Muralitharan fires on Marco Jansen after Rashid Khan hits sixes: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం వాంఖడే మైదానంలో గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఊహించని ఓటమిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రషీద్ ఖాన్ (31 నాటౌట్; 11 బంతుల్లో 4x6) చివరి చివర్లో మూడు సిక్సులు బాదడంతో గెలిచే మ్యాచును సన్‌రైజర్స్ కోల్పోయింది. పేసర్ మార్కో జాన్సెన్ చివరి ఓవర్లో ఏకంగా 25 పరుగులు ఇచ్చి ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి కారణమయ్యాడు.
గుజరాత్ టైటన్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు అవసరం కాగా.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌కు వచ్చాడు. మొదటి బంతిని రాహుల్ తెవాతీయా సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ రాగా.. మూడో బంతికి రషీద్ ఖాన్ స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. మూడో బంతిని రషీద్ సిక్స్ బాధగా.. నాలుగో బంతికి పరుగేమీ రాలేదు. దాంతో గుజరాత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 12 పరుగులుగా మారింది. స్ట్రైకింగ్‌లో రషీద్ ఉండడంతో ఎస్‌ఆర్‌హెచ్ గెలుపుపై నమ్మకంగా ఉండగా.. గుజరాత్ మాత్రం ఆశలు ఓటమి తప్పదనుకుంది.
మార్కో జాన్సెన్ వేసిన ఐదో బంతికి రషీద్ ఖాన్ భారీ సిక్స్ బాదడంతో ఇరు జట్లలో టెన్షన్ మొదలైంది. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి ఉండడంతో.. అప్పటికీ కూడా మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ వైపే ఉంది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ రషీద్ చివరి బంతిని కూడా స్టేడియంలోకి పంపించాడు. ఇంకేముంది ఎస్‌ఆర్‌హెచ్ అనూహ్యంగా ఓడిపోగా.. గుజరాత్ ఊహించని విజయాన్ని అందుకుంది.
చెత్త బౌలింగ్ వేసిన మార్కో జాన్సెన్‌పై ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డగౌట్‌లో ఉన్న ముత్తయ్య.. 'వాట్ ఈస్ దిస్ ఫక్' అంటూ బూతులు తిట్టాడు. అసలేం బౌలింగ్ చేస్తున్నాడు.. ఈ సమయంలో ఫుల్ లెంగ్త్ బంతులు వేయడం ఏంటి? అని గట్టిగా అరిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముత్తయ్య రియాక్షన్ ప్రస్తుతం వైరల్ అయింది. కొందరు ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్‌కు మద్దుతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. మీరూ ఓసారి వీడియో చుడండి.
Also Read: Flipkart Electronics Sale: రూ.19 వేలకే ఎయిర్ కండిషనర్.. నేడు ఆఫర్ చివరి రోజు!
Also Read: Google Search Fraud: గూగుల్‌లో సెర్చ్ చేశాడు.. లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.