Flipkart Electronics Sale: రూ.19 వేలకే ఎయిర్ కండిషనర్.. నేడు ఆఫర్ చివరి రోజు!

Flipkart Electronics Sale: వేసవిలో ఎండల తాపానికి ఇంటికి ఏసీ తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే! ప్రముఖ కంపెనీ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ. 19 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 04:19 PM IST
Flipkart Electronics Sale: రూ.19 వేలకే ఎయిర్ కండిషనర్.. నేడు ఆఫర్ చివరి రోజు!

Flipkart Electronics Sale: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ సేల్ జరుగుతోంది. ఏప్రిల్ 26న ప్రారంభమైన ఈ సేల్ నేటి (ఏప్రిల్ 28)తో పూర్తి కానుంది. ఈ సేల్ లో రిఫ్రిజిరేటర్లు, స్ప్లిట్ ఏసీలు, విండో ఏసీలపై భారీ తగ్గింపులను అందజేస్తున్నారు. మీరు కొత్త స్ప్లిట్ ఏసీని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే.. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేల్ ద్వారా MarQ 0.8 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ACని  కేవలం రూ. 20 వేల ధరకే కొనుగోలు చేయవచ్చు. 

MarQ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC ఆఫర్‌లు..

MarQ బై ఫ్లిప్‌కార్ట్ 0.8 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC లాంచ్ ధర రూ. 26,039 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ ఎయిర్ కండిషనర్ పై ఫ్లిప్ కార్ట్ లో 21 శాతం డిస్కౌంట్ తో అంటే రూ. 20,490 ధరకు అందుబాటులో ఉంది. 

అయితే ఈ స్ప్లిట్ ఏసీ కొనుగోలు సమయంలో Kotak లేదా RBL బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వినియోగించడం వల్ల అత్యధికంగా రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ తో స్ప్లిట్ ఏసీ ధర రూ. 18,990 వద్దకు చేరుతుంది. 

ఈ స్ప్లిట్ ఏసీపై ఏడాది వారెంటీతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎయిర్ కండిషనర్ లోని కంప్రెసర్ పై ఐదేళ్ల వరకు వారెంటీ అందుబాటులో ఉంది. ఈ ఏసీకి 3 స్టార్ రేటింగ్ వస్తుంది. HDFC క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఏసీని కొనుగోలు చేస్తే.. 24 నెలలకు గానూ.. EMI రూ. 994 చెల్లించేందుకు ఆఫర్ అందుబాటులో ఉంది. 

Also Read: MTNL 25 Recharge Plan: రూ.25 రీఛార్జ్ తో 365 రోజులు వ్యాలిడిటీ అందిస్తున్న ప్రముఖ టెలికాం సంస్థ!

Also Read: Hike in Beer Prices: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్, పెరగనున్న బీరు ధరలు, ఒక్కొక్క బీర్ ఎంతంటే..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x