Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!
MS Dhoni Birth Day Special: భారత జట్టు క్రికెట్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎంఎస్ ధోనీ పేరు కచ్చితంగా వినబడుతుంది. టీమిండియాకు టీ20, వన్డే, ఛాంపియన్ ట్రోఫీలను అందించడంతోపాటు టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా నిలిపాడు. నేడు ఎంఎస్ ధోని బర్త్ డే సందర్బంగా నెట్టింట్లో అభిమానులు సందడి చేస్తున్నారు.
MS Dhoni Birth Day Special: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1981 జూలై 7న రాంచీలో జన్మించిన ధోనీ.. 2004లో టీమిండియాకు ఎంపికయ్యాడు. కీపింగ్‌కు సరికొత్త నిర్వచనం ఇస్తూ.. బ్యాటింగ్‌లో సరికొత్త షాట్లను పరిచయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2007లో టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా బాధ్యతలు చేపట్టి.. టైటిల్ గెలిపించడంతో ధోని దశ తిరిగింది. 2008లో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ 2011, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013లను టీమిండియా గెలుచుకుంది. టెస్టుల్లో 2009లో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలిచింది. జట్టులో ఎంతోమంది యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేసి.. వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. వారిలో స్టార్ ప్లేయర్లుగా మారిన ఎవరో చూద్దాం..
విరాట్ కోహ్లీ
టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సచిన్ రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు అతనే. ధోనీ కెప్టెన్సీలోనే విరాట్ కోహ్లీ కెరీర్ ప్రారంభించాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీని మూడోస్థానంలో ఆడే అవకాశం కల్పించాడు ధోనీ. టెస్టుల్లోనూ కోహ్లీని ప్రోత్సహించాడు. 2011-12లో ఆసీస్ టూర్‌లో కోహ్లీ విఫలమైనా.. ధోనీ అండగా నిలిచి అవకాశాలు ఇచ్చాడు. 2012లో పెర్త్‌లో కోహ్లీ స్థానంలో రోహిత్‌కి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావించారు. అయితే ధోనీ తన మాత్రం తుది జట్టులోకి కోహ్లీనే తీసుకున్నాడు. ఈ విషయాన్ని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా చెప్పాడు. ఆ సమయంలో తానే వైస్ కెప్టెన్‌నని.. ధోనీ కోరిక మేరకు రోహిత్‌కు బదులుగా కోహ్లీని ఎంపిక చేశామన్నాడు. ధోనీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోహ్లీ నిలబెట్టుకుని.. ప్రపంచస్థాయి బ్యాటర్‌గా ఎదిగాడు.
రోహిత్ శర్మ
మొదట్లో మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ చాలా ఇబ్బందిపడేవాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. పెద్దగా రాణించలేకపోయాడు. ధోనీ తీసుకున్న నిర్ణయంతో రోహిత్ శర్మ కెరీర్ టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. వన్డేల్లో ఓపెనర్‌గా పంపించడంతో సరికొత్త రోహిత్ శర్మను పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచి రోహిత్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం టీమిండయా కెప్టెన్‌గా ఎదిగాడు.
రవిచంద్రన్ అశ్విన్
ప్రపంచంలోనే అత్యత్తుమ స్పిన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2010లో తొలిసారిగా ఆడే అవకాశం అశ్విన్‌కు ధోనీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన ఆకట్టుకుని.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో జట్టులోకి వచ్చిన అశ్విన్.. ఆ తర్వాత ఏడాది తర్వాత 2011 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ధోనీ కెప్టెన్సీలో అశ్విన్‌కు టెస్టులోనూ ఆడే అవకాశం లభించింది.
రవీంద్ర జడేజా
టీమిండియాకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్‌లలో ఒకడిగా నిలిచాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో జడ్డూ భాయ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. జడేజాను టీమిండియాలోకి తీసుకురావడం వెనుక ధోనీ హస్తం ఉంది. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరుఫున ఆడిన రవీంద్ర జడేజాను భారత జట్టులో ఎంపికయ్యేందుకు సాయం చేశాడు. జడేజాకు వరుసగా అవకాశాలు ఇవ్వడంతో తనను తాను నిరూపించకుని ప్రపంచస్థాయి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.
సురేష్ రైనా
చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు ధోనీ.. తరువాత సురేశ్ రైనాదే. రైనా జట్టుకు ఒంటి చెత్తో ఎన్నో విజయాలు అందించాడు. ధోనీతో రైనా స్నేహం గురించి క్రికెట్ అభిమానులకు అందరికీ తెలిసిందే. ధోనీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన రోజే.. రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వన్డేల్లో సురేశ్ రైనా
స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఎదగడంలో ధోనీ పాత్ర ఉంది.
Also Read: Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై
Also Read: ట్విస్ట్ అదిరింది.. వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి