Harbhajan Singh about Andrew Symonds sudden Death in Car Crash: శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. క్వీన్స్‌లాండ్‌లోని టౌన్‌విల్లేలో రాత్రి 10.30 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతోనే సైమండ్స్ ప్రాణాలు కోల్పోయారు. దిగ్గజ క్రికెటర్‌ మృతితో క్రికెట్‌ ఆస్ట్రేలియాతో పాటు క్రీడాలోకం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రతిఒక్కరు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంపై టీమిండియా మాజీ స్పిన్నర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైమండ్స్ మరణ వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. 'ఆండ్రూ సైమండ్స్ ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యాను. చాలా త్వరగా ఎందరికి దూరంగా వెళ్లిపోయాడు. అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సైమండ్స్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా' అని హర్భజన్ ట్వీట్ చేశారు. 


2007-08లో మైదానంలో ఆండ్రూ సైమండ్స్‌, హర్భజన్ సింగ్ మధ్య పెద్ద వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏం జరిగిందంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడేందుకు టీమిండియా ఆసీస్ గడ్డపైకి వెళ్లగా సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్టు జరిగింది. ఈ  టెస్టులో భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్‌, హర్భజన్ సింగ్ కలిసి 8వ వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సచిన్ క్రీజులో పాతుకుపోగా.. భజ్జీ అతడికి మంచి సహకారం అందించాడు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్లు ఈ జోడీని విడదీయడానికి నానా తంటాలు పడ్డారు.



ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌ లీ ఉద్దేశపూర్వకంగానే హర్భజన్ సింగ్‌పై స్లెడ్జింగ్‌కి దిగాడు. భజ్జీ కూడా తగ్గకపోవడంతో వాగ్వాదం మొదలైంది. ఈ సమయంలో ఆండ్రూ సైమండ్స్ కలగజేసుకోవడంతో గొడవని పెద్దయ్యింది. సైమండ్స్ మాటలకు సహనం కోల్పోయిన హర్భజన్.. మంకీతో తనని పోల్చినట్లు సైమండ్స్‌ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత క్రమశిక్షణ చర్యల కింద భజ్జీ మ్యాచ్ ఫీజులో కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం కూడా విధించారు. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేయకపోతే టూర్‌ని రద్దు చేసుకుంటామని టీమిండియా పట్టుబట్టింది. అప్పీల్స్ కమిషనర్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో.. శిక్షను రద్దు చేశారు. ఈ వివాదం సైమండ్స్, భజ్జీ కెరీర్‌లో చేదు అనుభవంగా మిగిలిపోయింది.


Also Read: SVP OTT: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచో తెలుసా?


Also Read: Eclipse & Pournami 2022: ఒకేరోజు చంద్రగ్రహణం, పౌర్ణమి.. అరుదైన ఘట్టం.. 80 ఏళ్ల తర్వాత గ్రహాలు, నక్షత్రాల కలయిక.. ఈ రాశులపై ప్రభావం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.