Hardik Pandya, Natasa Stankovic Trolled: క్రికెటర్ హార్థిక్ పాండ్యాను, పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్‌ని క్రికెట్ ప్రియులు, అతడి అభిమానులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ట్విటర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ ట్రోలింగ్ చేస్తూ హార్థిక్ పాండ్య పరువు తీస్తున్నారు. క్రికెట్ ప్రియులే కాదు.. నెటిజెన్స్ కూడా హార్థిక్ పాండ్యపై సీరయస్ అవుతున్నారు. ఇంతకీ హార్ధిక్ పాండ్యా చేసిన తప్పు ఏంటనే కదా మీ సందేహం.. ఇదిగో ఇక్కడున్న ఫోటోలు చూసి ఉంటే.. వారి ఆగ్రహానికి అసలు కారణం ఏంటో ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా హార్థిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ సోషల్ మీడియాలో పలు ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు మామూలుగా లేవు. ఆ ఇద్దరూ డీప్ రొమాన్స్ చేసుకుంటున్న ఫోటోలు అవి. లోకం మర్చిపోయి.. రొమాంటిక్ ఫోటోలకు ఫోజివ్వడం ఒక పిచ్చి పని అయితే.. ఆ ఫోటోలను ఇంకా ఇలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసుకుని ఇలా పబ్లిక్ చేయాలా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. 


ఆ ఫోటోల్లో హార్ధిక్ పాండ్యా అప్పీయరెన్స్ సాధారణంగానే ఉన్నప్పటికీ.. నటాషా గెటప్ మాత్రం సెక్సీగా, చూపరులను కవ్వించేలా ఉంది. ఆ మాటకొస్తే.. ఈ ఇద్దరూ కలిసి స్విమ్మింగ్‌పూల్లో అర్ధనగ్నంగా ఫోటోలు, వీడియోలకు ఫోజివ్వడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కొత్తేమీ కాకపోయినప్పటికీ... మరీ ఇలా రొమాన్స్ చేసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మాత్రం ఈసారి అభిమానులకు, నెటిజెన్స్‌కి ఇంకొంత ఆగ్రహం తెప్పించింది. 



 


ఈ ఫోటోలు చూసిన ఒక నెటిజెన్ దారుణమైన సెటైర్ వేశాడు. " వరల్డ్ కప్ ఎప్పుడూ వచ్చేదే.. ప్రాక్టిస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ నువ్వు మాత్రం ఇదే పనిలో ఉండు హార్థిక్ " అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. " క్రికెట్ ప్రాక్టీస్ మానేసి ఈ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నావా " అంటూ ఇంకొందరు సెటైర్ వేస్తున్నారు. 


నటాషా స్టాంకోవిక్ ఎవరో తెలుసు కదా..
హార్థిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ సెర్బియాకు చెందిన మోడల్. ప్రకాశ్ ఝా డైరెక్ట్ చేసిన సత్యాగ్రహ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దక్షిణాదిన కోలీవుడ్ శాండల్‌వుడ్ చిత్రాల్లోనూ నటించింది. 2014 - 15 లో ' బిగ్ బాస్ 8 ' రియాలిటీ షోలోనూ పాల్గొంది. నటాషా స్టాంకోవిక్ చివరిసారిగా ' నాచ్ బలియే 9 ' లో బిగ్ బాస్ 14 ఫేమ్ అలీ గోనీతో కలిసి కనిపించింది. ఇది కూడా చదవండి : 
Huge Dangerous King Cobra: పడగ విప్పిన పాముకే కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న మొనగాడు!


పెళ్లి కాకుండానే సహ జీవనం చేసిన హార్ధిక్ పాండ్యా, స్టాంకోవిక్ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబుకు అగస్త్య అని పేరు పెట్టారు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ జంట క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని అధికారికంగా ఒక ఇంటి వారయ్యారు.


ఇది కూడా చదవండి : King Cobra in Car Dicky: కారు డిక్కీలో పడగ విప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. పట్టుకోవాలని చూసిన సాహెబ్ కు తడిపించేసిన స్నేక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK