Huge King Cobra in Car Dicky: కారు డిక్కీలో పడగ విప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. తరిమేయాలని చూసిన వారి పైకి ఎలా ఎగబడిందో చూడండి!

Huge King Cobra in Car Dicky: పాములను చూసి భయపడే వీక్ హార్ట్ వాళ్లు ఉన్న వాళ్లయితే ఈ వీడియో అసలే చూడొద్దు. మరీ అంతలా భయపడాల్సిన పని లేదు.. మేం ధైర్యవంతులం అని అనుకుంటున్నారా ? అయితే ఈ వీడియో మీలాంటి వారి కోసమే. ఎందుకంటే.. ఇదిగో ఇలా కారు డిక్కీలో ఎక్కి కూర్చుని, పడగ విప్పిన పెద్ద పామును చూస్తే ఇకపై మీరు కారు ఎక్కిన ప్రతీసారి మీకు ఈ వీడియో గుర్తురావడం పక్కా.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2023, 11:39 AM IST
Huge King Cobra in Car Dicky: కారు డిక్కీలో పడగ విప్పి కూర్చున్న కింగ్ కోబ్రా.. తరిమేయాలని చూసిన వారి పైకి ఎలా ఎగబడిందో చూడండి!

Huge King Cobra in Car Dicky: మీకు కారు ఉందా ? కారు ఉంటేనేం.. కారు లేకుంటేనేం కానీ తరచుగా కారులో ప్రయాణించే అలవాటు ఉందా ? అయితే, మీరు ఈ వీడియోను గుండె చేత పట్టుకుని చూడండి. పాములను చూసి భయపడే వీక్ హార్ట్ వాళ్లు ఉన్న వాళ్లయితే ఈ వీడియో అసలే చూడొద్దు. మరీ అంతలా భయపడాల్సిన పని లేదు.. మేం ధైర్యవంతులం అని అనుకుంటున్నారా ? అయితే ఈ వీడియో మీలాంటి వారి కోసమే. ఎందుకంటే.. ఇదిగో ఇలా కారు డిక్కీలో ఎక్కి కూర్చుని, పడగ విప్పిన పెద్ద పామును చూస్తే ఇకపై మీరు కారు ఎక్కిన ప్రతీసారి మీకు ఈ వీడియో గుర్తురావడం పక్కా.

వీడియో థంబ్‌నేల్ చూశారు కదా.. ఈ డేంజరస్ కింగ్ కోబ్రా స్నేక్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో.. కారు డిక్కీలో ఎక్కి పడగవిప్పి బుసలు కొడుతున్న నాగు పామును చూసిన కారు యజమాని.. ఆ పామును అందులోంచి బయటికి తీసేందుకు ఫకీర్ అయిన ఓ స్నేక్ క్యాచర్‌ని తీసుకొచ్చాడు. సాధారణ స్నేక్ క్యాచర్ అయితే, ఆ పాము చూసి పరుగెత్తాల్సిందే.. చూడ్డానికే ఆ స్నేక్ అంత డేంజర్ గా ఉంది. కానీ ఈ వీడియోలో ఉన్న స్నేక్ క్యాచర్ అలా కాదు.. గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. ఎందుకంటే సాధారణంగా స్నేక్ క్యాచర్స్ వద్ద పాములను హ్యాండిల్ చేయడానికి ఒక వంకు తిరిగిన ఐరన్ రాడ్ ఉంటుంది. కానీ ఇతడు మాత్రం చేతిలో ఆ స్నేక్ క్యాచింగ్ రాడ్ లేకుండానే రంగంలోకి దిగాడు. 

ఇది కూడా చదవండి: Huge Dangerous King Cobra: పడగ విప్పిన పాముకే కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న మొనగాడు

కిందా, మీదా పడి .. ఎంతో ధైర్యం చేసి.. ఆ నాగు పాము తోక పట్టి లాగి బయటికి తీసుకొచ్చాడు. తనని లాగి కిందపడేయడంతోనే ఆ నాగు పాముకు అతడిపై కాటేసేంత కోపం వచ్చింది.. కానీ అతడు తెలివిగా దూరం జరిగి ఆ పాము కాటు బారి నుంచి తప్పించుకున్నాడు. పోన్లే పాము కారులోంచి బయటికొచ్చింది కదా అని అంతటితో ఊరుకున్నాడా అంటే అదీ లేదు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న పామును వెళ్లిపోనివ్వకుండా మరోసారి ఆ పాము తోక పట్టుకున్నాడు. ఈసారి పాముకు మామూలు కోపం రాలేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News