IPL 2022: అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా!
IPL 2022: రాబోయే ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీలో భాగం కానున్నారు. కొత్త జట్టుకు హార్దిక్ కెప్టెన్ గా వ్యవహారిస్తాడని సమాచారం.
IPL 2022: ఈ సారి ఐపీఎల్ లో (IPL 2022) రెండు కొత్త జట్లు ప్రవేశించాయి. వాటిలో ఒకటి అహ్మదాబాద్, మరొకటి లక్నో జట్టు (Lucknow Team). ఈ రెండు జట్లు ఈనెల 22లోపు తమ జట్టులో ఉండే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఐపీఎల్ పాలకమండలికి నివేదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ జట్టులో హార్డిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ (Rashid Khan) ఆడతారని అహ్మదాబాద్ జట్టు (Ahmedabad franchise) నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
అయితే ఇంకా ఐపీఎల్ మెగా వేలం జరగలేదు. కానీ ముందస్తుగా ఆయా ఆటగాళ్లతో అహ్మదాబాద్ జట్టు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లకు కలిపి అహ్మదాబాద్ జట్టు ఫ్రాంచైజీ రూ.33 కోట్లు వెచ్చించింది. పాండ్యాకు (Hardik Pandya) రూ.15 కోట్లు, రషీద్ ఖాన్‌కు రూ.11 కోట్లు, శుభమన్‌గిల్‌కు (Shubman Gill) రూ.7 కోట్ల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్ జట్టుకు (Ahmedabad Team) హార్డిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Ben Stokes: రూట్ దారిలోనే స్టోక్స్.. ఐపీఎల్ మెగా వేలానికి దూరం!
కొత్త కోచింగ్ స్టాఫ్..
అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తన కోచింగ్ స్టాఫ్‌ని కూడా ఖరారు చేసింది. వీరికి ప్రధాన కోచ్ గా గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten), బౌలింగ్ కోచ్ గా ఆశిష్ నెహ్రా (Ashish Nehra) వ్యవహరించనున్నారు. ప్రస్తుతం సర్రే ప్రధాన కోచ్‌గా ఉన్న ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ విక్రమ్ సోలంకీ (Vikram Solanki) జట్టు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. నెహ్రా, కిర్‌స్టన్, సోలంకీ త్రయం కలిసి పనిచేయనున్న రెండవ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇది. గతంలో వీరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పనిచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook