Ben Stokes: రూట్​ దారిలోనే స్టోక్స్​.. ఐపీఎల్​ మెగా వేలానికి దూరం!

IPL 2022: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2022, 11:08 AM IST
  • ఐపీఎల్‌కు మరో ఆటగాడు దూరం
  • ఈ సీజన్ కు దూరం కానున్న ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు
  • రూట్​ బాటలోనే స్టోక్స్ కూడా..
Ben Stokes: రూట్​ దారిలోనే స్టోక్స్​.. ఐపీఎల్​ మెగా వేలానికి దూరం!

Stokes joins Root in opting out of IPL 2022 auction: ఇటీవల జరిగిన యాషెస్​ సిరీస్​లో (Ashes series) ఇంగ్లాండ్ ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ (England)​ 4-0 తేడాతో సిరీస్​ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టులకు కాకుండా టీ20లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉండాలని పలువురు ఇంగ్లండ్ క్రికెటర్లు నిర్ణయించుకున్నారు. 

ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (Joe Root) ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. కష్టాల్లో ఉన్న తన జట్టు కోసం ఈ ఏడాది ఐపీఎల్​ మెగా వేలంలో (IPL 2022 Mega Auction) పాల్గొనట్లేదని రూట్ తెలిపాడు​. అయితే జో రూట్ బాటలోనే ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కూడా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశంలో వచ్చే క్రికెట్ సీజన్‌ కోసం మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలనే లక్ష్యంతో స్టోక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది కూడా గాయం కారణంగా ఐపీఎల్​​​ మధ్యలోనే వైదొలిగాడు స్టోక్స్​. గతంలో బెన్ స్టోక్స్‌ రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Also Read: Manjrekar - Kohli: కెప్టెన్సీ ముప్పును గ్రహించి.. కోహ్లీ ముందే తప్పుకున్నాడు! సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News