Hardik Pandya’s watches: హార్థిక్ పాండ్య నుంచి ఎయిర్ పోర్టులో రూ. 5 కోట్ల విలువైన వాచీలు స్వాధీనం
Hardik Pandya’s watches seized at airport: హార్థిక్ పాండ్యకు ఖరీదైన చేతి గడియారాలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అతడి వద్ద రూ. 5 కోట్లకుపైగా విలువైన పటెక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినం 5711 వాచ్ (Patek Philippe Nautilus Platinum 5711) ఉంది.
Hardik Pandya’s watches seized at airport: టీమిండియా ఆల్-రౌండర్ హార్థిక్ పాండ్య నుంచి రూ. 5 కోట్ల విలువైన ఖరీదైన చేతి గడియారాలను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ వేడుకలు ముగించుకుని నవంబర్ 14న ఆదివారం రాత్రి భారత్‌కి తిరిగొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఏబీపీ లైవ్ కథనం పేర్కొంది.
దుబాయ్ నుంచి తిరిగొచ్చిన హార్థిక్ పాండ్య తన వద్ద ఉన్న ఆ ఖరీదైన చేతి గడియారాలకు సంబంధించిన బిల్లులు చూపించలేకపోయాడు. అదే సమయంలో వాటిని కస్టమ్స్ గూడ్స్‌గానూ (Customs goods) చూపించలేదు. దీంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
హార్థిక్ పాండ్యకు ఖరీదైన చేతి గడియారాలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అతడి వద్ద రూ. 5 కోట్లకుపైగా విలువైన పటెక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినం 5711 వాచ్ (Patek Philippe Nautilus Platinum 5711) ఉంది.
జీక్యూ ఇండియా పేర్కొన్న ఓ కథనం ప్రకారం హార్థిక్ పాండ్య వద్ద ఉన్న ఈ చేతి గడియారం ప్లాటినంతో పాటు (Platinum watches) ఖరీదైన పచ్చని కెంపులు ఉపయోగించి తయారు చేశారు. గడియారంలో ఈ పచ్చని రంగు రాళ్లు గంటలను సూచిస్తాయి. అంతేకాకుండా గడియారం చుట్టూ వృత్తాకారంలోనూ ఈ పచ్చని కెంపులు అమర్చి ఉన్నట్టు మనం ఫోటోలో చూడవచ్చు.
Also read : Who is RCB captain in IPL 2022: యుజ్వేంద్ర చాహల్‌కి బెంగళూరు కెప్టేన్సీ ?
ఐపిఎల్ 2021 సెకండ్ హాఫ్ సీజన్ ప్రారంభం కావడానికంటే నెల రోజుల ముందే హార్థిక్ పాండ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు ఫోటోలు పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలలో ఈ ఖరీదైన వాచ్ కూడా ఉంది. హార్థిక్ పాండ్యకు ఖరీదైన వాచ్‌లపై (Hardik Pandya's watches) ఉన్న మోజుకు ఈ ఫోటో అద్దం పడుతుంది.
విచిత్రంగా గతేడాది హార్థిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య (Hardik Pandya's brother Krunal Pandya) కూడా ఇలాగే దుబాయ్ నుంచి వస్తూ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ముంబై ఎయిర్ పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలీజెన్స్ విభాగం అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రూ. 1 కోటి విలువైన బంగారంతో పాటు ఖరీదైన వాచ్‌లు కలిగి ఉన్నాడనే అభియోగాల కింద ముంబై ఎయిర్ పోర్టులో అప్పట్లో కృనాల్ పాండ్యను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు అతడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
Also read : Shoaib Akhtar about David Warner: 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ వార్నర్‌కు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook