Harmanpreet Kaur takes a Stunning flying Catch to dismiss Amy Jones: జాంటీ రోడ్స్, యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, బ్రెండన్ మెక్‌కల్లమ్, రవీంద్ర జడేజా, స్టీవ్ స్మిత్, డ్వేన్ బ్రావో, కిరన్ పోలార్డ్.. ఇలా చెప్పుకుంటే పొతే ఎందరో పురుష క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్‌లు ఉన్నారు. మహిళల క్రికెట్‌లో మాత్రం వేళ్లమీద ఉంటుంది ఆ సంఖ్య. ఇప్పుడిప్పుడే వుమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో ఔరా అనిపిస్తున్నారు. ఇప్పటికే ఇండియ‌న్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమినా రోడ్రిగ్స్ తమ అద్భుత ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. బౌండరీ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసిన ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఇండియన్ బ్యాటర్ పట్టిన వీడియో కూడా నెట్టింట హల్చల్ చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2022లో భాగంగా బుధవారం మౌంట్ మౌంగనీయ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే మ్యాచ్ ఓడినా భారత జట్టు ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టింది. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓ సూపర్ క్యాచ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకెళ్లింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ హీథర్ నైట్ (53) క్రీజులో ఉండి పరుగులు చేసింది. ఆమెకు నటాలీ స్కివర్ (45) అండగా నిలిచింది.


అయితే 17వ ఓవర్ చివరి బంతికి నటాలీ స్కివర్ ఔట్ కాగా.. వికెట్ కీపర్ అమీ ఎలెన్ జోన్స్ క్రీజులోకి వచ్చింది. భారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌ వేసిన 25వ ఓవర్ నాలుగో బంతిని అమీ జోన్స్ భారీ షాట్ ఆడింది. లాంగ్ ఆఫ్ దిశగా వెళుతున్న బంతిని హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా క్యాచ్ అందుకుంది. క్యాచ్ పట్టే క్రమంలో వెనకకు వెళ్లిన హర్మన్.. బాల్ అందుకున్న తర్వాత తలకిందులుగా పడిపోయింది. అయినా కూడా టీమిండియా వైస్ కెప్టెన్ బాల్‌ను మాత్రం వదలలేదు. దాంతో అమీ నిరాశగా పెవిలియన్ చేరింది. 



స్టన్నింగ్ క్యాచ్ పట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్‌ను సహచరులు ప్రశంసలతో ముంచెత్తారు. హర్మన్‌ప్రీత్ పుట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్యాచ్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ  వీడియోపై లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టాడేమో' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'సూపర్ వుమెన్' స్టన్నింగ్‌ క్యాచ్‌, స్టన్నింగ్ క్యాచ్ అంటూ వీడియో చూసిన వారు పోస్టులు పెడుతున్నారు.


Also Read: Gold and Silver Rates Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర! నేటి పసిడి, వెండి రేట్లు ఇవే!!


Also Read: Today Horoscope March 17 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శత్రువులకు దూరంగా ఉండాలి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook