Daily Horoscope March 17 2022: మేషం ( Aries): మీమీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శివపార్వతులను పూజించడం మంచిది.
వృషభం (Taurus): కీలక వ్యవహారాలలో లాభాలు పొందుతారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. సాయిబాబా దర్శనం శుభప్రదం.
మిథునం (Gemini): మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయవద్దు. వారికి దూరంగా ఉండడం మంచిది. హనుమాన్ చాలీసా చదవాలి.
కర్కాటకం (Cancer): పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.
సింహం (Leo): అవసరానికి సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓ పని మీ కుటుంబ సభ్యులకు మేలు చేస్తుంది. ప్రయాణ సూచన ఉంది. గోవిందనామాలు చదవటం మంచిది.
కన్య (Virgo): ఆశించిన ఫలితాలు వస్తాయి. కుటుంబం, బంధువుల సహకారం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.
తుల (Libra): శుభకాలం నడుస్తోంది. మంచి వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు వస్తుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio): ప్రారంభించబోయే పనుల్లో శ్రమ ఫలితాలను ఇస్తుంది. కీలక వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. శనిధ్యానం శుభప్రదం.
ధనస్సు (Sagittarius): చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నాయి. అందరిని కలుపుకొనిపోవడం వల్ల పనులు పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ కలహాలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.
మకరం (Capricorn): శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వివాదాలకు పోకూడదు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.
కుంభం (Aquarius): తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. మీ నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. సమయానికి డబ్బు వస్తుంది. శివనామస్మరణ మేలు చేస్తుంది.
మీనం (Pisces): మంచి ఫలితాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.
Also Read: Omicron attack on China: రూపం మార్చిన ఒమిక్రాన్ వేరియంట్, చైనాపై దాడి, భారీగా పెరుగుతున్న కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook