Uppal Stadium: ఊపిరి పీల్చుకున్న ఉప్పల్ స్టేడియం.. కోట్లలో ఉన్న కరెంట్ బిల్లులు చెల్లింపు
HCA Paid Uppal Stadium Pending Of Electricity Bills Rs 1.64 Cr: ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలపడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరెంట్ కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి.
Uppal Stadium Bills: తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన క్రికెట్ స్టేడియం హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియానికి సంబంధించి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. బిల్లులు బకాయి ఉండడంతో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఐపీఎల్‌లో కలకలం రేపింది. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. కానీ పేరుకుపోయిన ఆ బకాయిలు తాజాగా తీరాయి. పదేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించడంతో ఉప్పల్ స్టేడియం ఊపిరి పోసుకుంది.
Also Read: Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధీనంలోని ఉప్పల్ స్టేడియానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్) విద్యుత్ సరఫరా అందిస్తోంది. అయితే 2015 నుంచి ఈ స్టేడియానికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదు. దాదాపు తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో బిల్లులు ఉండడంతో ఇటీవల ఐపీఎల్ సమయంలో విద్యుత్ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. కీలకమైన మ్యాచ్‌లు జరిగే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే.
ప్రతిష్ట దిగజారొద్దని
ఊహించని పరిణామంతో హైదరాబాద్ క్రికెట్ సంఘం వెంటనే స్పందించి అప్పుడు తాత్కాలికంగా కొంత మేర బిల్లులు చెల్లించింది. కానీ తాజాగా మంగళవారం హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ కలిసి పెండింగ్‌లో ఉన్న మొత్తం బిల్లు రూ.1,48,94,521 ను చెల్లించారు. విద్యుత్ బిల్లులు అంశానికి శుభం కార్డు పడిందని హెచ్‌సీఏ ప్రకటించింది. పదేళ్లకు సంబంధించి సుమారు రూ.1.64 లక్షల విద్యుత్ బిల్లు బకాయి ఉందని.. ఐపీఎల్ సమయంలో రూ.15 లక్షలు చెల్లించినట్లు హెచ్‌సీఏ తెలిపింది. మిగిలిన మొత్తం 4-5 వాయిదాల్లో చెల్లించాలనుకుంటే కానీ తమ ప్రతిష్ట దిగజారొద్దనే ఆలోచనతో ఒకేసారి మొత్తం బిల్లు చెల్లించినట్లు వివరించింది.
చర్యలు తీసుకోవాలి
ఈ మేరకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీని కలిసి మొత్తం బిల్లుకు సంబంధించి చెక్ రూపంలో అందించినట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు చెప్పారు. అయితే బిల్లుల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి ఐపీఎల్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ కట్ చేసి, హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter