ఆ విషయంలో రోహిత్ శర్మతో ఏకీభవించను... శిఖర్ ధావన్
ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్‌లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ
హైదరాబాద్: ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్‌లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయంతో మాత్రం ఏకీభవించనని స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. ఓపెనర్‌గా ఇప్పటికే తానెంటో నిరూపించానని, రోహిత్, రాహుల్‌లతో కలసి టీమిండియాకు వన్డే, ట్వంటీ20 ఫార్మాట్‌లలో ఎన్నో మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పానని ధావన్ వివరించాడు.
సహచర క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో నిర్వహించిన లైవ్ చాట్‌లో ధావన్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడం కాస్త ఇబ్బందికర విషయమేనని, అంత మాత్రాన తాను వారికి భయపడతానని భావించకూడదన్నాడు. ప్రపంచంలోని ఎందరూ అత్యుత్తమ స్పీడ్‌స్టర్ల బౌలింగ్‌ను తాను దీటుగా ఎదుర్కొన్నానని, దీనికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను సాధించిన పరుగులే నిదర్శనమన్నాడు. ఇకపై రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ఆడడమే ఏకైక లక్షంగా పెట్టుకున్నట్టు ధావన్ స్పష్టం చేశాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..