Sourav Ganguly reacts on Viral Photo with Virat Kohli: బీసీసీఐ అధ్యక్షుడిగా తాను చేయాల్సిన పనిని చేస్తున్నానని, తనపై వచ్చే నిరాధార వార్తలకు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సౌరవ్‌ గంగూలీ అన్నారు. ఇటీవల సెలక్షన్‌ కమిటీ సభ్యులతో పాటు విరాట్‌ కోహ్లీ, బీసీసీఐ సెక్రటరీ జై షాలతో కలిసి దాదా సమావేశమైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాంతో బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా సెలెక్షన్‌ కమిటీ వ్యవహారాల్లో దాదా తలదూరుస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై గంగూలీ తనదైన శైలిలో స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీరు సెలెక్షన్‌ కమిటీని ప్రభావితం చేస్తున్నారని, బీసీసీఐ సమావేశాల్లో సెలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్తలు వాస్తవమేనా? అని అడగ్గా...'ఇలాంటి నిరాధార వార్తలకు నేను ఎవరికీ ఏదైనా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను బీసీసీఐ అధ్యక్షుడిని, బీసీసీఐ అధ్యక్షుడు చేయాల్సిన పని చేశాను. సెక్రెటరీ జై షా, జాయింట్ సెక్రెటరీ జయేశ్ జార్జ్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలతో కలిసి ఉన్న ఫొటో నెట్టింట  వైరల్ అయ్యింది. అది నేను చూశాను. అయితే ఆ ఫొటో సెలెక్షన్‌ కమిటీ సమావేశంలో తీసింది కాదు' అని అన్నారు. 


'నేను ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. జయేశ్ జార్జ్‌ బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ మెంబర్‌ కాదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో సెలెక్షన్‌ కమిటీ సమావేశంలోనిది కాదు. విరాట్‌ కోహ్లీతో కలిసి ఫోటో దిగినంత మాత్రానా నేను సెలక్షన్‌ కమిటీ మీటింగ్‌కు హాజరైనట్లు కాదు. ఇది తెలుసుకోండి. నేను బీసీసీఐ అధ్యక్షుడు కాక ముందు భారత జట్టు తరఫున 424 అంతర్జాతీయ మ్యాచులు ఆడాను. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కాస్త ఫైర్ అయ్యారు. 


'జై షా నాకు మంచి స్నేహితుడు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కూడా నేను, జై షా, అరుణ్‌ ధూమల్, జయేశ్‌ జార్జ్‌ భారత క్రికెట్‌ కోసం పని చేస్తున్నాం. ఇక టీమిండియా భవిష్యత్ దృష్ట్యా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టెస్టు కెప్టెన్‌ని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేస్తారు. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై సెలెక్టర్లు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చి ఉంటారు. వాళ్లతో చర్చించాక.. సరైన సమయంలో పేరు వెల్లడిస్తాం' అని బీసీసీఐ బాస్ చెప్పుకొచ్చారు. 


Also Read: IPL 2022 Auction: బెంగళూరు కెప్టెన్‌ రేసులో ఆరుగురు.. అవకాశం ఎవరికి దక్కనుందో మరి?


Also Read: MLA Roja Resignation: వైసీపీలో ప‌ద‌వుల చిచ్చు.. రాజీమానాకి సిద్దమైన ఎమ్మెల్యే రోజా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook